E-Paper
Advertisement

RAM CHARAN: రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సిరీస్ మూవీ కోసం మంతనాలు..!

RAM CHARAN: రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సిరీస్ మూవీ కోసం మంతనాలు..!
Advertisement

RAM CHARAN: బాలీవుడ్‌లో టాప్ మోస్ట్ ఫ్రాంచైజీ చిత్రాల్లో ‘ధూమ్’ ఒకటి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి ‘ధూమ్’, ‘ధూమ్2’, ‘ధూమ్3’ వంటి చిత్రాలు రిలీజై ప్రేక్షకులను అలరించాయి. అందరి అంచనాలకు మించి రెస్పాన్స్ అందుకొని.. కలెక్షన్లను రాబట్టాయి. ఇక ఈ ఫ్రాంచైజీస్ నుంచి మరో చిత్రం రూపొందడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే అందులో టాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు అన్ని భాషల్లో నటించేందుకు ఇష్టపడుతున్నారు. అందులో ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చి చేరినట్లు తెలుస్తోంది. అతడు కొంతకాలంగా తరచూ ముంబైకి వెళ్తున్నాడని.. అక్కడ బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్. అంతేకాదండోయ్.. ముంబైలో ఏకంగా ఒక ఫ్లాట్‌ని తీసుకొని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లతో చరణ్ చర్చలు జరుపుతున్నట్లు వినికిడి.

Advertisement

దీంతో గ్లోబల్ స్టార్‌గా ఎంతో పేరు సంపాదించుకున్న చరణ్ ఇప్పుడు ‘ధూమ్4’ లో నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని అభిమానులు ఆశ పడుతున్నారు. అంతేకాకుండా.. ఇప్పటివరకు వచ్చిన ధూమ్ సిరీస్‌లలో కేవలం బాలీవుడ్ హీరోలే నటించారు. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు వినిపిస్తుండటంతో ఈ విషయంపై ధూమ్ మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇక రామ్ చరణ్ కంటే ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన వార్ 2లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటించబోతున్నాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×