E-Paper
Advertisement

Tummala Nageswara Rao | ‘తెలంగాణ అనే శివలింగం మీద తేలు లాంటోడు కేసీఆర్’ : తుమ్మల

Tummala Nageswara Rao : కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక శివలింగం మీద తేలు లాంటి వాడు అని, ఆ తేలును కొడదామంటే కింద తెలంగాణ అనే లింగం ఉందని గులాబీ బాస్‌పై ఘాటుగా సెటైర్లు వేశారు. ఖమ్మం పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచార కార్యక్రమాలలో పాల్గోన్నారు.

Tummala Nageswara Rao | ‘తెలంగాణ అనే శివలింగం మీద తేలు లాంటోడు కేసీఆర్’ : తుమ్మల
Advertisement

Tummala Nageswara Rao : కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక శివలింగం మీద తేలు లాంటి వాడు అని, ఆ తేలును కొడదామంటే కింద తెలంగాణ అనే లింగం ఉందని గులాబీ బాస్‌పై ఘాటుగా సెటైర్లు వేశారు. ఖమ్మం పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచార కార్యక్రమాలలో పాల్గోన్నారు.

ఈ సందర్భంగా తుమ్మల ప్రసంగిస్తూ.. “శివలింగం మీద తేలు లాంటి వాడు కేసీఆర్. ఆ తేలును కొడదామంటే కింద తెలంగాణ అనే లింగం ఉంది. ఓటు అనే ఆయుధంతోనే ఆ తేలును కొట్టాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఎంతోమంది బలిదానాలతోనే వచ్చింది. అలాంటి తెలంగాణ తన ఒక్కడిదే అన్నట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచకపాలనను తరిమికొట్టాల్సిన అవసరం ఉంది” అని వ్యాఖ్యలు చేశారు.

Advertisement

‘‘ఖమ్మంలో తాగు నీటి కష్టాలు లేకుండా పిల్టర్ బెడ్స్ నిర్మాణంతో ట్యాంకర్లకు బదులు ట్యాప్‌లు తెచ్చాను. అహంకారంకు ఖమ్మం ప్రజల ప్రతిష్టకు మధ్య జరిగే ఎన్నికలు ఇవి. తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలి. రాహుల్ గాంధీ నాయకత్వం బలపరిచేలా ఖమ్మం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో 11వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. అరాచకం లేని ఖమ్మం కోసం, ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీనే ఈ ఎన్నికల్లో భారీ మేజార్టీతో గెలిపించాలి’’ అని తుమ్మల పిలుపునిచ్చారు.

2014 తెలంగాణ ఎన్నికలలో ఖమ్మం అసెంబ్టీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు ఆ తరువాత బీఆర్ఎస్‌లోకి చేరారు. గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ పదవి ద్వారా తుమ్మల కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.

Advertisement

ఆ తరువాత పాలేరు ఎమ్మెల్, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి అనారోగ్యంతో మరణించడంతో పాలేరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి విజయం సాధించారు.కానీ తిరిగి 2018 డిసెంబర్ ఎన్నికలలో పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ తరువాత కందాల ఉపేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఈ సంవత్సరం జరుగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పాలేరు టికెట్ ఉపేందర్ రెడ్డికి లభించింది. ఈ పరిణామాలతో అసంతృప్తి చెందిన తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ గూటికి చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీ పాలేరు టికెట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించింది. తుమ్మలకు ఖమ్మం టికెట్ లభించింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×