E-Paper
Advertisement

Free Bus Scheme: మహాలక్ష్మి పతకానికి రెండేళ్లు.. ఏకంగా 251 కోట్ల మంది మహిళలు ప్రయాణం

Free Bus Scheme: మహాలక్ష్మి పతకానికి రెండేళ్లు.. ఏకంగా 251 కోట్ల మంది మహిళలు ప్రయాణం
Advertisement

Free Bus Scheme: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఆరు గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యింది. ఈ పథకం మహిళా ఆర్థిక స్వాతంత్ర్యం వైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన అడుగుగా గుర్తింపు పొందింది. ఈ రెండేళ్ల కాలంలో ఈ పథకం లక్షలాది మంది మహిళల దైనందిన జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పథకాన్ని విజయవంతం చేసినందుకు రాష్ట్రంలోని మహిళలకు, అలాగే నిరంతరం సేవలు అందిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి, ఉద్యోగులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిసెంబర్ 9, 2023న ఈ పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి గుర్తు చేశారు.

Advertisement

మంత్రి పొన్నం ప్రభాకర్ అందించిన వివరాల ప్రకారం, మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఆర్టీసీ బస్సులలో ఏకంగా 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు తెలిపారు. ఈ భారీ సంఖ్య ఈ పథకం ఎంత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువైందో స్పష్టం అవుతోంది. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం విద్యార్థినులకు, కూలీలకు, ఉద్యోగినులకు, అలాగే.. గృహిణులకు ఆర్థికంగా పెద్ద ఉపశమనం కల్పించింది.

మహాలక్ష్మి పథకం కేవలం ఉచిత ప్రయాణం అందించడంతోనే ఆగలేదని, ఇది మహిళలకు అనేక రకాలుగా ఉపయోగపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు తమ ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల కోసం సులభంగా ప్రయాణించడం, ఆ విధంగా వారి ఆర్థిక కార్యకలాపాలను పెంచడం, మెరుగైన ఉపాధి అవకాశాలను పొందడానికి దోహదపడింది. బస్సు చార్జీలు ఆదా కావడం ద్వారా ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకునే అవకాశం మహిళలకు దక్కింది.

Advertisement

ఈ సందర్భంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ పథకంపై ప్రభుత్వ దృష్టికోణాన్ని తెలియజేశాయి. “మహిళలను కేవలం బస్సుల్లో ప్రయాణం చేయించడమే కాదు, మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా తెలంగాణ నిలుస్తుంది” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Also Read: కూకట్‌పల్లిలో ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ నిర్మాణం.. ఇది ఎంత పెద్దంటే?

అంతేకాకుండా మహాలక్ష్మి పథకం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకోవడం వెనుక తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కృషి ఎంతో ఉంది. ప్రయాణికుల రద్దీ పెరిగినా, సిబ్బంది సామర్థ్యం మేరకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. ఈ పథకం అమలులో ఎదురైన సాంకేతిక, నిర్వహణా సవాళ్లను అధిగమిస్తూ, రవాణా శాఖ ఈ పథకాన్ని సుస్థిరం చేయడంలో విజయం సాధించింది. ఈ పథకం రానున్న రోజుల్లో మరింత మంది మహిళలకు ఆర్థిక భరోసాను, స్వాతంత్ర్యాన్ని అందించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×