E-Paper
Advertisement

ఆలేరులో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన కీలక నాయకులు!

ఆలేరులో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన కీలక నాయకులు!
Advertisement

BRS Revival: స్వేచ్చ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, ప్రభుత్వ విప్ ఉన్నప్పటికీ ఈరోజు వందలాది మంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటే.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రాబోతోందనడానికి ఇది స్పష్టమైన సంకేతం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఎలక్షన్లు పెడితే ఎవరు గెలుస్తారనే సర్వేలన్నీ మళ్లీ కేసీఆర్ రావాలనే చెబుతున్నాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం పరిధిలోని మోటకొండూర్ డా.బీ.ఆర్.అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరబోయిన మల్లేష్ యాదవ్, వేణు గార్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సునీతా మహేందర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు కర్నె ప్రభాకర్, క్యామ మల్లేశం, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ ది రైతు పాలన..

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఏ వర్గం చూసినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని ముక్తకంఠంతో కోరుకుంటున్నారన్నారు.కేసీఆర్ ది రైతు పాలన అయితే, రేవంత్ రెడ్డిది రాక్షస పాలన. ఆనాడు 24 గంటల కరెంట్ వస్తే.. నేడు 6, 7 గంటల కరెంటు మాత్రమే వస్తోంది. అది కూడా ట్రిప్పుల మీద ట్రిప్పులు అవుతూ వోల్టేజ్ లేక రైతులు మోటార్లు పంచుకుని నీళ్లు పారించుకునే దయనీయ స్థితికి రాష్ట్రం చేరుకుంది. రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేసీఆర్ రైతుబంధు ఆగకుండా ఇచ్చి రైతులను కాపాడారు. రేవంత్ రెడ్డి 15,000 ఇస్తానని చెప్పి.. ఒక పంటకు రెండు ఎకరాలకే వేసి, ఇంకో పంటకు ఎకరానికే పరిమితం చేసి రైతులను నిలువునా మోసం చేశాడని అన్నారు.

Advertisement

Also read: ధోని వల్లే రెండు వ‌ర్డ‌ల్ క‌ప్ ట్రోఫీలు వ‌చ్చాయి..కానీ ఆ ద‌ద్ద‌మ్ముల వ‌ల్ల కాదు !

మోసం చేసిన ఘనుడు..

సాక్షాత్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టుపెట్టి దేవుణ్ని కూడా మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 డెడ్ లైన్లు మూడు దాటిపోయినా ఇప్పటికీ సగానికి సగం మందికి రుణమాఫీ కాలేదు. రైతు ఏ కారణం చేత చనిపోయినా వారం రోజుల్లో 5 లక్షల బీమా ఇచ్చిన కేసీఆర్ ఎక్కడ.. అసలు రైతు బీమానే లేకుండా చేసిన రేవంత్ రెడ్డి ఎక్కడ? కాంగ్రెస్ పాలనలో వడ్ల బస్తాకు 2 నుంచి 5 కిలోల తరుగు తీశారు. అసెంబ్లీలో కూర్చుని తరుగు తీస్తే తోలుతీస్తానని డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి.. వాస్తవానికి మిల్లర్లు, బ్రోకర్ల చేతుల్లో తోలుబొమ్మలా మారిపోయాడు. కేసీఆర్ పాలనలో ఆటోలో ఇంటికే యూరియా బస్తాలు వస్తే, నేడు యూరియా దొరక్క రైతులు క్యూ లైన్లలో నిలబడుతున్నారు. 1300 ఉండే డీఏపీ ధర నేడు 2100, 2200 కు పెరిగిందని అన్నారు.

నాపై తప్పడు వ్యాఖ్యలు..

Advertisement

ఎంపీ చామల కిరణ్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలను నేను సూటిగా అడుగుతున్నా.. దమ్ముంటే రాత్రి పూట ఆలేరులోని ఏ సబ్ స్టేషన్‌కైనా వద్దాం రండి. కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదో మీరిద్దరూ రైతులకు సమాధానం చెప్పాలి. మోటకొండూర్, ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో ఎంతోమంది రైతులు, పేదల భూములను రాత్రికి రాత్రి 22A నిషేధిత జాబితాలో పెట్టి వారి ఆస్తుల విలువను సున్నా చేశారు. దీనిపై నేను ప్రశ్నిస్తే నాపై బురదజల్లుతున్నారని ఫైర్ అయ్యారు. నెలకు రూ. 2000 చొప్పున 33 నెలలకు ఒక్కో అవ్వతాతకు రూ. 66,000 రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. మహిళలకు ఇస్తానన్న రూ. 2500 ఏ ఒక్కరి ఖాతాలోనూ పడలేదు. 100 రోజుల్లో ఇస్తామన్న గొర్రెపిల్లల హామీ వెయ్యి రోజులైనా అమలుకాలేదు. గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా ఆపేశారని అన్నారు.

Also read: హోటళ్ల ముసుగులో ఓపెన్ బార్లు.. తూముకుంట దాబాల్లో ఏం జరుగుతోంది?

Tags

Related News

జూరాల డ్యామ్‌ వద్ద ఉత్కంఠ.. రైతుల ధర్నాతో పోలీసులు పహారా!

మేం అధికారంలోకి వస్తే చేసే మొట్టమొదటి పని ఇదే.. కవిత క్లారిటీ..?

హోటళ్ల ముసుగులో ఓపెన్ బార్లు.. తూముకుంట దాబాల్లో ఏం జరుగుతోంది?

డేట్ టైమ్ ఫిక్స్ చెయ్.. కేటీఆర్‌కు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్!

తెలంగాణలో మరో వారంపాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

నోరు అదుపులో పెట్టుకోండి.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్!

ఎల్లంపేటలో కుండపోత వర్షం.. చెరువులా తలపిస్తున్న ప్రధాన రహదారులు!

Big Stories

Advertisement
×