BigTV English

Uttam Kumar Reddy: ఇదేం పద్ధతి ఉత్తమ్ గారూ?.. బిగ్ టీవీపై అంత అక్కసు ఎందుకు?

Uttam Kumar Reddy: ఇదేం పద్ధతి ఉత్తమ్ గారూ?.. బిగ్ టీవీపై అంత అక్కసు ఎందుకు?

Uttam Kumar Reddy news(Telugu breaking news today): ఓ వైపు కొత్త చేరికలతో కాంగ్రెస్‌ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంటే.. మాజీ పీసీసీ ప్రెసిడెంట్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మాత్రం బిగ్‌ టీవీపై అక్కసు వెళ్లగక్కారు. తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ బిగ్‌టీవీ ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాటలు విని తనపై దుష్ప్రచారం చేయొద్దంటూ చెప్పుకొచ్చారు.


ఉత్తమ్ చెప్పిన దాంట్లో రెండు విషయాలను గమనించాలి.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి చెప్పినట్లు పనిచేయడానికి బిగ్‌టీవీ ఏమీ ఆయన సంస్థ కాదు.. స్వతంత్రంగా, స్వచ్చమైన జర్నలిజం కోసం పనిచేస్తున్న సంస్థ. మాకున్న సమాచారం మేరకు, మాకున్న సోర్సుల ప్రకారం మాకు అందిన వార్తలను మేం నిర్భయంగా ప్రసారం చేస్తాం.

ఇక ఉత్తమ్‌ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేయాల్సిన అవసరం బిగ్ టీవీకి అంతకన్నా లేదు.. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం చాలా యాక్టివ్‌గా ఉంది. ఓ పార్టీలో నుంచి మరో పార్టీలోకి జంపింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. మాకున్న పక్కా సమాచారంతోనే ఎప్పటికప్పుడు పొలిటికల్ అప్‌డేట్స్ ఇస్తున్నాం. పొంగులేటి ఏ వైపు వెళ్తారన్న కన్ఫ్యూజన్‌లో అంతా ఉన్నప్పుడు… కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మొదటగా చెప్పింది బిగ్ టీవీనే. మేం చెప్పినట్లే ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పొంగులేటి. అది మా క్రెడిట్‌.


ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై ప్రసారం చేసిన వార్తలను కూడా మాకున్న సోర్సుల ప్రకారమే చెప్పాం. ఆయన వెర్షన్ కోసం ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. అప్పటికీ ఆయన విడుదల చేసిన ఖండనను కూడా ప్రసారం చేశాం. మేం పక్షపాతంతో వ్యవహరించడం లేదనడానికి అదే నిదర్శనం. మేం చెప్పే వార్తలను ఎవరైనా ఖండించవచ్చు. దాన్ని కూడా ప్రసారం చేయడానికి బిగ్‌టీవీ సిద్ధం. కానీ, రేవంత్‌ చెప్పిన మాటలు విని బిగ్‌టీవీలో వార్తలు వేశారనడంలోనే.. ఉత్తమ్‌లోని కడుపు మంట అర్థమవుతోంది. మీ పార్టీలో ఆధిపత్య పోరు ఉంటే.. దాన్ని బిగ్‌టీవీకి ఆపాదించడం సరికాదని స్పష్టం చేస్తున్నాం.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×