E-Paper
Advertisement

Vigilance Raids on Kaleswaram : జలసౌధలో ముగిసిన సోదాలు.. విజిలెన్స్‌ అధికారుల చేతిలో కీలకమైన ఫైల్స్..

Vigilance Raids on Kaleswaram : జలసౌధలో ముగిసిన సోదాలు.. విజిలెన్స్‌ అధికారుల చేతిలో కీలకమైన ఫైల్స్..
Advertisement

Vigilance Raids on Kaleswaram : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్‌ జలసౌధలో విజిలెన్స్‌ అధికారుల సోదాలు ముగిశాయి. దాదాపు 8గంటల పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నరు. విజిలెన్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఉదయం 9గంటల సమయంలో జలసౌధకు వచ్చిన అధికారులు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్ రావు, రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఎండీ హరిరామ్‌ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు.

ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై అధికారులు ఫోకస్ చేశారు. ఆనకట్ట డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు అధికారులు. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాలపై కూడా అధికారుల బృందం దృష్టి పెట్టారు.

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్ పుట్టపగిలిపోనుంది. ఈ విషయంలో తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఏకకాలంలో చాలా చోట్ల దాడులు చేస్తున్న విజిలెన్స్ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రాజెక్ట్ అప్రూవల్స్, కేంద్ర శాఖల క్లియరెన్స్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. కన్నేపల్లి పంప్ హౌజ్ బాహుబలి మోటార్ల డీటైల్స్ కోసం కార్యాలయంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.

డిజైన్ కు విరుద్ధంగా బాహుబలి మోటార్ల ప్లాంటేషన్ జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. మొత్తంగా సోదాలు పూర్తయిన తర్వాత కాళేశ్వరం స్కామ్ పై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనున్నారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×