E-Paper
Advertisement

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు!

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు!
Advertisement

Shamshabad Accident: శంషాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వెళ్తున్న ఒక కంటైనర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక ట్రావెల్స్ బస్సు ఈ కంటైనర్‌ను తప్పించబోయి అదుపుతప్పింది. రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలతో పాటు ఒక బైక్‌ను వేగంగా ఢీకొంటూ పక్కనే ఉన్న ఒక హోటల్‌లోకి నేరుగా దూసుకెళ్లిపోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు.

హోటల్‌లోకి దూసుకెళ్లిన బస్సు

Advertisement

బస్సు హోటల్ గోడలను బలంగా ఢీకొట్టడంతో లోపల ఉన్న స్టౌపై మంటలు ఒక్కసారిగా పైకి ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడ భారీ అగ్నిప్రమాదం జరుగుతుందేమోనని స్థానికులు, ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించిన స్థానిక ప్రజలు, వ్యాపారులు సాహసంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ మంటలను ఆర్పివేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.

Also Read: గిరిజనుల వైపు గులాబీ చూపు.. బీఆర్ఎస్ కొత్త పొలిటికల్ గేమ్!

Advertisement

పోలీసుల విచారణ

ఈ వరుస ప్రమాదంలో మొత్తం పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రహదారిపై నిలిచిపోయిన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

గిరిజనుల వైపు గులాబీ చూపు.. బీఆర్ఎస్ కొత్త పొలిటికల్ గేమ్!

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్‌దే సుప్రీం రోల్.. అసలేం జరుగుతోంది?

ఏ పార్టీలోకి వెళ్తే ఫ్యూచర్ ఉంటది? గ్రామీణ యువత పొలిటికల్ స్కెచ్!

మౌలాలి వద్ద రైలుపై తెగిపడ్డ విద్యుత్ తీగలు.. నిప్పురవ్వలు -ప్రయాణికులు బెంబేలు, రైలును నిలిపేసిన లోకో పైలెట్

మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. వినాయక మండపం వద్ద ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య!

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు.. నేడే విచారణ!

Big Stories

Advertisement
×