Download e-PAN card: ప్రస్తుత డిజిటల్ ట్రెండ్‌లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లోన్ తీసుకోవాలన్నా, లేదా ఏదైనా మేజర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా పాన్ కార్డ్ (PAN Card) కచ్చితంగా ఉండాల్సిందే. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు, లేదా హడావుడిలో ఒరిజినల్ కార్డ్‌ను పోగొట్టుకోవడం లేదా అది పాడైపోవడం లాంటి సమస్యలు చాలా మందిలో ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు కంగారు పడిపోయి రోజుల తరబడి కొత్త కార్డ్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ , UTIITSL లేదా డైరెక్ట్‌గా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ డిజిటల్ ఈ-పాన్ కార్డ్‌ను ఇన్‌స్టంట్‌గా పొందే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మీ పాన్ కార్డ్ నంబర్ గనక మీ గుర్తు ఉంటే చాలు, ఈ క్రింది సింపుల్ స్టెప్స్‌తో క్షణాల్లో మీ డిజిటల్ ఈ-పాన్‌ను మీ ఫోన్‌లోకి తెచ్చుకోవచ్చు.
వెబ్‌సైట్‌కి వెళ్లండి: ముందుగా NSDL (ప్రస్తుతం Protean) లేదా UTIITSL పాన్ పోర్టల్, లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవ్వండి.
డైరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి: అక్కడ మీకు ‘Download e-PAN’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ , మీ పుట్టిన తేదీ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా టైప్ చేయండి.
ఓటీపీ వెరిఫికేషన్ మస్ట్: మీ పాన్ కార్డ్‌కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీకి ఒక వన్-టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. ఆ ఓటీపీని స్క్రీన్ మీద ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి.
చిన్న ఫీజు చెల్లించండి (అవసరమైతే): మీరు రీసెంట్‌గా గత 30 రోజుల్లోగా మొదటి సారి పాన్ కార్డ్ జనరేట్ చేసుకున్నట్లయితే.. ఇది పూర్తిగా ఉచితం. ఒక వేళ పాత పాన్ కార్డ్ రీ-ప్రింట్ లేదా డిజిటల్ కాపీ కోసం అయితే.. నామమాత్రపు ఫీజు (సుమారు రూ. 8 నుంచి రూ. 50 లోపు) ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది.
Also Read: వైబ్స్ మారాలంటే ఈ స్పీకర్ ఉండాల్సిందే.. రూ.1199కే క్రేజీ సౌండ్
పీడీఎఫ్ సేవ్ చేసుకోండి: పేమెంట్ ప్రాసెస్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవ్వగానే మీ డిజిటల్ ఈ-పాన్ కార్డ్ పీడీఎఫ్ రూపంలో స్క్రీన్ పైకి వస్తుంది. దీన్ని మీ ఫోన్ లేదా లాప్ టాప్‌లో సేవ్ చేసుకోండి. ఈ పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ చేయడానికి మీ పుట్టిన తేదీని పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇలా ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌గా డౌన్‌లోడ్ చేసుకున్న ఈ-పాన్ కార్డ్.. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు, ఇతర అధికారిక ప్రదేశాలన్నింటిలోనూ ఒరిజినల్ కార్డ్ లాగే వంద శాతం చట్ట బద్ధమైనదిగా చెల్లుబాటు అవుతుంది. సో, పాన్ కార్డ్ పోయిందని ఏమాత్రం టెన్షన్ పడకుండా.. వెంటనే ఈ ఈజీ ఆన్‌లైన్ ట్రిక్‌తో మీ ఈ-పాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి!