E-Paper
Advertisement

CP Sunpreet Singh: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది పెరిగిన నేరాల సంఖ్య.. వార్షిక నివేదికను విడుదల చేసిన సీపీ

CP Sunpreet Singh: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది పెరిగిన నేరాల సంఖ్య.. వార్షిక నివేదికను విడుదల చేసిన సీపీ
Advertisement

CP Sunpreet Singh: వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2024–25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన నేర గణాంకాలు, పోలీసింగ్ విధానాలు, రికవరీలు, శిక్షలు, ప్రజా భద్రతపై తీసుకున్న చర్యలను వివరించారు. గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ, పోలీస్ విభాగం సమర్థవంతమైన చర్యలతో నేర నియంత్రణలో కీలక పురోగతి సాధించిందని సీపీ వెల్లడించారు.

వరంగల్ కమిషనరేట్ పరిధిలో అన్ని రకాల నేరాల్లో మొత్తం 14,456 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. మహిళలపై నమోదైన అన్ని రకాల నేరాల్లో 9.12 శాతం తగ్గుదల కనిపించడం విశేషమని పేర్కొన్నారు. అయితే పోక్సో కేసులు, లైంగిక వేధింపుల కేసుల్లో 3.6 శాతం పెరుగుదల ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. మహిళలు, పిల్లల భద్రతకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.

Advertisement

మత్తు పదార్థాల అక్రమ రవాణాపై వరంగల్ పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 196 NDPS కేసులు నమోదు కాగా, 482 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.8.62 కోట్ల విలువ చేసే నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా నిరంతరం ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

హ్యూమన్ ట్రాఫికింగ్‌పై కూడా కఠిన చర్యలు తీసుకున్నామని సీపీ తెలిపారు. మొత్తం 16 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో 55 మందిని అరెస్ట్ చేయగా, 28 మంది బాధితులను విముక్తి చేసినట్లు వివరించారు. బాధితులకు పునరావాసం కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తున్నామని అన్నారు.

Advertisement

ప్రాపర్టీ నేరాల్లో రూ.10.10 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి కేసులు నమోదు కాగా, అందులో రూ.4.55 కోట్ల విలువైన ఆస్తిని రికవరీ చేయగలిగామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రికవరీ శాతం 13 శాతం పెరగడం.. పోలీస్ దర్యాప్తు సామర్థ్యానికి నిదర్శనమని సీపీ పేర్కొన్నారు.

న్యాయస్థానాల్లో కేసుల పరిణామాలపై కూడా సానుకూల ఫలితాలు వచ్చాయని చెప్పారు. మొత్తం 6,768 కేసుల్లో 3,071 కేసుల్లో నేర నిరూపణ జరిగిందని తెలిపారు. 45.37 శాతం కన్విక్షన్ రేటుతో గత ఏడాదితో పోలిస్తే.. 3 శాతం పెరుగుదల నమోదు కావడం వరంగల్ పోలీస్ విభాగం సాధించిన కీలక విజయం అని అన్నారు.

సైబర్ క్రైమ్ విభాగంలో 630 కేసులు నమోదు కాగా, రూ.12.42 కోట్ల రూపాయల మోసాలు జరిగినట్లు వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని సీపీ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 162 మంది, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 177 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు చెప్పారు.

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 719 మంది రౌడీ షీటర్లు ఉన్నారని, 2025 సంవత్సరంలో కొత్తగా 45 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు. ప్రజా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు.

ట్రాఫిక్ విభాగంలో 35,513 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా, 887 మందికి జైలు శిక్ష విధించామని చెప్పారు. మొత్తం 10,56,664 ట్రాఫిక్ చలాన్లు చెల్లింపులు జరిగాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే, 1,434 ప్రమాదాల్లో 406 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు పెరిగినట్లు తెలిపారు. గతేడాది 52 ప్రమాదాల్లో 19 మంది మృతి చెందగా, ఈ ఏడాది 76 ప్రమాదాల్లో 26 మంది మృతి చెందినట్లు వివరించారు.

Also Read: తప్పు చేశావు.. నీళ్ల వివాదంపై కవిత లెక్కలు

భద్రతా పరంగా మరో కీలక విజయం సాధించినట్లు సీపీ పేర్కొన్నారు. మొత్తం 17 మంది మావోయిస్టులు లొంగిపోవడం రాష్ట్రంలో శాంతి స్థాపనకు మంచి సూచనగా అభివర్ణించారు. ప్రజల సహకారంతో మరింత బలమైన పోలీసింగ్ అందిస్తామని సీపీ సన్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×