E-Paper
Advertisement

CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్‌లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?

CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్‌లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?
Advertisement

CMO Report: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 26 అసెంబ్లీ నియోజకవర్గాలు డల్ గా ఉన్నట్లు సీఎంవో ఇంటర్నల్ రిపోర్టులో తేలింది. పార్టీ ప్రోగ్రామ్స్ ను సమర్ధవంతంగా అమలు చేయడంలో, పథకాలను గ్రౌండ్ లెవల్లో తీసుకువెళ్లడంలో ఆయా నియోజకవర్గాలు వెరీ స్లోగా ఉన్నట్లు గుర్తించారు.వెంటనే పనితీరు మెరుగు పర్చుకోవాలని సీఎం కూడా సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం అత్యంత రహస్యంగా సేకరిస్తున్న ‘మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్’ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శాసనసభ్యులు, ముఖ్య నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాబోయే ‘వన్ ఇయర్’అత్యంత కీలకం కానుండటంతో ఇప్పటికైనా అలర్ట్ అవ్వకపోతే టికెట్లకే ఎసరు వస్తుందనే గట్టి హెచ్చరికలు అధిష్ఠానం నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది.

వ్యతిరేకత ఎంత శాతం ఉంది?

వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాపాలన, సంక్షేమ పథకాల డెలివరీపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి, కేవలం అధికారుల మాటలు, వివరణ రిపోర్టులను నమ్మడం లేదు. క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏజెన్సీలతో పాటు, సీఎంవో ద్వారా ఇంటెలిజెన్స్, ప్రైవేట్ సర్వేల రూపంలో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ప్రజాపాలన దరఖాస్తులు, సంక్షేమ పథకాల పంపిణీ అర్హులకు సక్రమంగా అందుతుందా? లేదా లూప్‌హోల్స్ ఉన్నాయా? ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న సానుకూలతలు, వ్యతిరేకత ఎంత శాతం ఉంది?

సమన్వయం ఉందా..?

Advertisement

నియోజకవర్గాల్లో కలెక్టర్లు, తహశీల్దార్లు, పోలీసు యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా లేక సమన్వయంతో వెళ్తున్నారా? ఇటీవల కాలంలో పార్టీలోకి వచ్చిన కొత్త నేతలకు, మొదటి నుంచి జెండా మోసిన పాత కాడర్లకు మధ్య సమన్వయం ఉందా? లేక గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయా? అధిష్ఠానం పిలుపునిచ్చే నిరసనలు, సంబరాలు, పార్టీ సభ్యత్వాలు, ఇతర కార్యక్రమాలను ఎమ్మెల్యేలు ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారు? స్థానికంగా ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయా? భూ వివాదాలు, అనుచరుల అత్యుత్సాహం వంటివి కొనసాగుతున్నాయా? అనే తదితర అంశాలపై సంపూర్ణంగా సర్వేల ద్వారా డేటా సేకరిస్తున్నారు.

Also Read: తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

ఆ 26 నియోజకవర్గాల్లో లోపం ఎక్కడ?

Advertisement

​మొత్తం 119 స్థానాల్లో సీఎంవో సేకరించిన ప్రాథమిక నివేదికల ప్రకారం సుమారు 26 అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితి కాస్త వీక్ గా ఉన్నట్లు తేలింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల ప్రచారం బాగున్నా, క్షేత్రస్థాయిలో డెలివరీ సిస్టమ్ వీక్‌గా ఉన్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు, అధికారులతో సమన్వయ లోపం వల్ల పనులు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల కొత్త వర్సెస్ పాత నేతల వర్గపోరు పతాక స్థాయికి చేరి, క్యాడర్‌లో నైరాశ్యం నింపిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరి కొన్ని చోట్ల తమకు పదవులు రాలేదని, కాంట్రాక్టులు, ఆశించిన స్థాయిలో పనులు రావడం లేదని క్షేత్రస్థాయిలోని కొందరు లీడర్లు పార్టీలో ఉంటూనే నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించారు. దీనివలన ప్రభుత్వానికే మచ్చ వచ్చే ప్రమాదం ఉన్నదని అధిష్టానం గుర్తించింది. ఈ మంత్లీ రిపోర్టుల ఆధారంగా సీఎంవో ఇప్పటికే ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేసినట్లు తెలిసింది. పనితీరు మార్చుకోని కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు సున్నితంగానే క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి ఇచ్చిన డైరెక్షన్ ఇదే…

రాబోయే ఏడాది కాలం పార్టీకి, ప్రభుత్వానికి అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ వన్ ఇయర్ నిరంతరం ప్రజల్లో ఉంటూ, పథకాలను స్పీడప్ చేస్తారో వారికే పార్టీలో భవిష్యత్తు ఉంటుందని సీఎం స్పష్టంగా తేల్చి చెప్పారట.ప్రతి నెల నియోజకవర్గ ప్రగతి నివేదిక సీఎం టేబుల్ మీదికి వెళ్తుంది. ఏ చిన్న తప్పు దొర్లినా ఉపేక్షించేది లేదని పార్టీ పెద్దలు కూడా నొక్కి చెప్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని కలుపుకుపోతూనే, పాత నేతలకు సముచిత స్థానం కల్పించాలని, వర్గపోరుతో పార్టీ నష్టపోతే కఠిన చర్యలు తప్పవంటి తాజాగా పీసీసీ చీఫ్​ కూడా అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి డైరెక్షన్ లు పార్టీ బలోపేతం, నేతలు తప్పిదాలు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడతాయని ఓ సీనియర్ నేత తెలిపారు.

Also Read: Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి!

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×