BigTV English
Advertisement

BL Santhosh : ఎవరీ బీఎల్ సంతోష్?.. ఎమ్మెల్యేలకు ఎర వేయడంలో ఎక్స్ పర్ట్?

BL Santhosh : ఎవరీ బీఎల్ సంతోష్?.. ఎమ్మెల్యేలకు ఎర వేయడంలో ఎక్స్ పర్ట్?

BL Santhosh : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేసే ఫోన్ కాల్ సంచలనంగా మారింది. ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, నందకుమార్ లతో మాట్లాడిన సంభాషణ వైరల్ గా మారింది. ఆ ఆడియోలో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నా.. ఈ మొత్తం వ్యవహారంలో బీఎల్ సంతోష్ కింగ్ పిన్ గా తెలుస్తోంది. సంతోష్ ఆధ్వర్యంలోనే రామచంద్రభారతి ముందుండి ఈ డీల్ నడిపించారని అర్థం అవుతోంది. నెంబర్ 1, నెంబర్ 2 (మోదీ, అమిత్ షా కావొచ్చు) లే బీఎల్ సంతోష్ ఇంటికి వచ్చి విషయం తెలుసుకుంటారని అన్నారంటే.. ఆయనెంత పవర్ ఫుల్ లీడరో తెలిసిపోతోంది. ఇంతకీ ఎవరీ బీఎల్ సంతోష్? ఆయన ఎంతటి కీలక లీడర్?


బీఎల్ సంతోష్. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి. ఆర్ఎస్ఎస్ కు పార్టీకి మధ్య కీలక అనుసంధానకర్త. బీజేపీ వ్యవహారాలన్నీ ఈయనే చూస్తున్నారు. బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో సంతోషే కీ పర్సన్. అదే ఫార్ములా తెలంగాణలోనూ అప్లై చేయాలని చూసి.. అడ్డంగా దొరికిపోయారని అంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేసే ఎపిసోడ్ మొత్తం ఢిల్లీ కేంద్రంగానే నడిచిందని.. బీఎల్ సంతోష్ ఆదేశాలతోనే రామచంద్రభారతి.. నందకుమార్ ద్వారా రోహిత్ రెడ్డికి గాలం వేశారని.. ఆయన ద్వారా మరింత మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగేయాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. బీఎల్ సంతోష్ మాస్టర్ మైండ్ అలా ఉంటుంది మరి!

కొన్ని నెలల క్రితమే తెలంగాణలో పర్యటించారు బీఎల్ సంతోష్. పార్టీలో అంతర్గత విభేదాలను చక్కదిద్ది వెళ్లారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా జరిగిన సీక్రెట్ మీటింగ్స్ కు చెక్ పెట్టి పార్టీని సెట్ రైట్ చేశారు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలనేది బీజేపీ పట్టుదల. ఆ బాధ్యతలు సంతోష్ స్వీకరించారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో మోదీ, అమిత్ షాల తర్వాత అంతటి పవర్ ఫుల్ లీడర్ ఆయనే. ఆర్ఎస్ఎస్ వాలంటీర్‌ నుంచి ఈ స్థాయికి ఎదిగారు.


కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు సంతోష్. ఇంజినీరింగ్ చేసి.. ఆర్ఎస్ఎస్ లో చేరి సుదీర్ఘకాలం పని చేశారు. లో ప్రొఫైల్ లీడర్. మీడియాకు, ప్రజలకు దూరంగా ఉంటూ.. తెరవెనుక నుంచి పరిస్థితులను, సంక్షోభాలను చక్కదిద్దడంలో ఆరి తేరారు. కర్ణాటక బీజేపీ ఇంఛార్జీగా రాణించారు. యడియూరప్పతో విభేదాలు ఉండేవి. ఓ దశలో కర్ణాటక సీఎం పదవి ఆయనకేననే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి షిఫ్ట్ అయ్యారు. పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ట్రబుల్ షూటర్ గా సంతోష్ పేరు మారుమోగింది. మోదీ మెప్పు పొందారు. బెంగాల్ తర్వాత ప్రస్తుతం తెలంగాణపై నజర్ వేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్. ఇప్పుడు ఎమ్మెల్యేల ట్రాప్ ఎపిసోడ్ లో ఆయన పేరు వినిపించడం సంచలనంగా మారింది. పక్కాగా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్.. కేసీఆర్ ఎత్తుతో చిత్తైంది. బీజేపీ అడ్డంగా బుక్కైంది..అని అంటున్నారు.

Related News

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Big Stories

×