E-Paper
Advertisement

Hyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. భార్య ఆత్మహత్య..

Hyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. భార్య ఆత్మహత్య..
Advertisement
Telangana news updates

Hyderabad latest news(Telangana news updates):

యూట్యూబ్‌ ద్యారా తెలుసుకున్న జ్యోతిష్యం ప్రకారం.. తాను- తన భర్త విడిపోతామని బలంగా నమ్మి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని అంబర్‌పేటకు చెందిన బబిత అనే యువతికి ఐదేళ్లక్రితం బాలంరాయికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణతో వివాహం జరిగింది. వీరిద్దరూ కానాజిగూడ ఇందిరానగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

ఆదివారం బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బబిత తల్లిదండ్రులు తప్ప బంధుమిత్రులంతా హాజరయ్యారు. సోమవారం ఉదయం భర్త ఆఫీస్ కి వెళ్లాడు. రెండుగంటలకు అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి.. తన తల్లి ఇంట్లో ఫ్యానుకు వేలాడుతుండటం చూశాడు. కింది పోర్షన్‌లో ఉన్న బాబాయికి వద్దకు వెళ్లి చెప్పాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు వచ్చి రామకృష్ణ పై దాడిచేశారు. అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురు మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

అత్తింటివారు తెలిపిన వివరాల ప్రకారం.. బబితకి జ్యోతిష్య మంటే ఎంతో నమ్మకం. జ్యోతిష్యాన్ని నమ్మవద్దని బబితను రామకృష్ణ పదేపదే కోరేవాడు. దీనిపై ఇటీవల వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అందరి ముందు రామకృష్ణ ఆమెను కొట్టాడు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెబుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×