BigTV English

Komaram Bheem: కొమురం భీం జిల్లాలో కొట్లాడుకున్న పులులు.. మరోపులి మృతి..

Komaram Bheem: కొమురం భీం జిల్లాలో కొట్లాడుకున్న పులులు.. మరోపులి మృతి..

Komaram Bheem: కొమురం భీం జిల్లాలో వరుసగా పులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో మరో పులి మృతదేహాన్ని అటవీ అధికారులు గుర్తించారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఐదు రోజుల క్రితం ఓ ఆడ పులి చనిపోయింది. రెండో పులి గాయపడిందని అధికారులు తెలిపారు. అయితే.. ఆ రెండో పులి డెడ్ బాడీని కూడా సోమవారం గుర్తించారు. గాయాలతో రెండో పులిని గుర్తించినపుడు అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలించారు. దీంతో.. ఆ రెండు పోట్లాడుకున్నాయని తేల్చారు. మొదటి పులి మృతదేహానికి కొంతదూరంలో నిన్న రెండో పులి మృతదేహం కూడా కనిపించింది. పులుల సంరక్షణ ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది.


దరిగాం అటవీ ప్రాంతంలో 3 రోజుల వ్యవధిలోనే 2 పులులు మృతి చెందాయి. టెరిటోరియల్ ఫైట్ లో ఒక పెద్దపులి మృతి చెందగా.. మూడు సంవత్సరాల వయసున్న మరో పులి సైతం మరణించింది. పీసీసీఎఫ్ రాకేశ్ డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పరగ్వేన్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఆశ్రయం కోసమే రెండు పులులు కొట్లాడుకుని ఉంటాయని భావిస్తున్నారు. తొలుత మృతి చెందిన పులికి పోస్ట్ రూట్ నిర్వహించి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అనంతరం NTCA నిబంధనల ప్రకారం చనిపోయిన పులిని ఖననం చేశారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×