E-Paper
Advertisement

Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ..? మునుగోడు నుంచే పోటీ..?

Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ..? మునుగోడు నుంచే పోటీ..?
Advertisement

Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? మునుగోడు స్థానాన్ని తిరిగి రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉందా? ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్, బీజేపీల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైనప్పటికీ మొదటి లిస్టులో రాజగోపాల్‌రెడ్డి పేరు లేదు. దీంతో ఆయన కాంగ్రెస్ లోకి తిరిగి వస్తారనే ప్రచారం మొదలైంది. అందుకే బీజేపీ అధిష్టానం టిక్కెట్ ప్రకటించలేదని తెలుస్తోంది.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు. ఉపఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు.

Advertisement

బీజేపీ నుంచి పోటీ చేసి ఓడినా, ఆయనకు మునుగోడు టికెట్ ఖరారు చేయలేదు బీజేపీ. మరోవైపు తొలి జాబితాలో మునుగోడును పెండింగ్‌లో పెట్టింది కాంగ్రెస్. మునుగోడు సీటును సీపీఐకి ఇస్తామని ఇంతకుముందు కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఇప్పుడు మునుగోడు కాకుండా సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు ఇస్తామంటోంది హస్తం పార్టీ .
అంటే సీపీఐ ఇవ్వకుండా రాజగోపాల్ రెడ్డి కోసమే ఆ సీటును కాంగ్రెస్ పెండింగ్ లో ఉంచుతోందా అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనకు ముందు రాజగోపాల్ రెడ్డి తిరిగి పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×