E-Paper
Advertisement

Congress : కాంగ్రెస్ ప్రచార దూకుడు.. ప్రియాంక గాంధీ టూర్ షెడ్యూల్ ఇదే?

Congress : కాంగ్రెస్ ప్రచార దూకుడు.. ప్రియాంక గాంధీ టూర్ షెడ్యూల్ ఇదే?
Advertisement

Congress : ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి లిస్ట్‌ ప్రకటించడమే కాకుండా కాంగ్రెస్ ప్రచారంలోనూ దూసుకుపోతోంది. మలుగు బహిరంగ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీలను ప్రకటించారు. రాహుల్ గాంధీ ఆ తర్వాత కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. ఈనెల 30న నల్గొండలో ప్రియాంక రోడ్‌షో ఉంటుందని చెప్పారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అలాగే కొల్లాపూర్ లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రియాంక గాంధీ.

మరోవైపు అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు జరుగుతోంది. స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు తుదిదశకు చేరిందని తెలుస్తోంది. వరుసగా రెండో రోజు ఢిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల ఎంపికపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. మిగతా 64 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 35 నుంచి 40 మంది అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. అక్టోబర్ 25న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. అదే రోజు కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

వామపక్షాలతో కాంగ్రెస్‌ పొత్తు కుదిరినా.. సీట్ల సర్దుబాటుపై పీటముడి వీడలేదని సమాచారం. సీట్ల సర్దుబాటుపై స్క్రీనింగ్‌ కమిటీ చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రతిపాదన చేసిందంటున్నారు. వైరాకి బదులు పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతోందని సమాచారం. పాలేరు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని వార్తలు వస్తున్నాయి. వైరా సీటుతో సరిపెట్టుకోవాలని సీపీఎం నేతలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై మరొకసారి రాష్ట్ర నాయకత్వం వామపక్షాలతో చర్చించే అవకాశం ఉందంటున్నారు.

ఇంకోవైపు కాంగ్రెస్‌లో చేరికల జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న వారిలో కొందరికి టికెట్లు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. టికెట్ ఆశావాహులంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు రెండో లిస్ట్‌లో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం, ప్రాతినిధ్యం దక్కుతుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×