E-Paper
Advertisement

నైరుతి రుతుపవనాలకు బ్రేక్.. ఎండలు పెరిగే అవకాశం, తెలంగాణలో మళ్లీ వానలు ఎప్పుడు?

నైరుతి రుతుపవనాలకు బ్రేక్.. ఎండలు పెరిగే అవకాశం, తెలంగాణలో మళ్లీ వానలు ఎప్పుడు?

Weather Updates: తెలంగాణలో నైరుతి రుతుపవనాల బలహీనపడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ తెలంగాణ-హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిలిచిపోయే అవకాశం ఉంది. మరో 10 రోజుల వరకు ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి రుతుపవనాలకు బ్రేక్.. ఎండలు పెరిగే అవకాశం

దేశంలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ప్రస్తుతం బుధవారం దక్షిణ తెలంగాణ-హైదరాబాద్ పరిధిలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ 17 వరకు ఉత్తర-ఈశాన్య తెలంగాణ వైపు కదిలే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. రుతుపవనాలు బలహీనపడడంతో జూన్ 17 వరకు తెలంగాణలో ఎండ తీవ్రత పెరగనుంది.

వేడి కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన చెదురు ముదురు వర్షాలు పడే అవకాశముంది. జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా జూన్ 19 నుంచి 23 మధ్య తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో రుతుపవనాలు చురుగ్గా కదలనున్నాయి. అప్పుడు మళ్లీ వర్షాలు పడనున్నాయి.

తెలంగాణలో మళ్లీ వానలు 10 రోజుల తర్వాతే

ఎండలతో ఇబ్బందిపడుతున్న జనానికి మళ్లీ జూన్ 18 తర్వాత ఊరట లభించనుంది. జూన్-సెప్టెంబర్ రుతుపవన కాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

గతంలో నైరుతి రుతుపవనాల వర్షపాతాన్ని దీర్ఘకాల సగటుతో 92 శాతంగా అంచనా వేసింది. పెరగనున్న ఉష్ణోగ్రతల వల్ల దక్షిణాసియాలో చాలా ప్రాంతాల్లో కరువు, వడగాలులు, నీటి కొరత, అడవులు దహనం వంటి ప్రమాదాలు పెరిగే అవకాశముంది.

ALSO READ: తెలంగాణను ‘స్కిల్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యం.. FTCCI వేడుకల్లో శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

Related News

నిజామాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. సిద్దాపూర్ రిజర్వాయర్‌కు రూ.250 కోట్లు మంజూరు!

ఘనపూర్‌లో రాజయ్య ‘తాండవం’.. భట్టి, కడియంల గుట్టు విప్పుతూ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణను ‘స్కిల్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యం.. FTCCI వేడుకల్లో శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1.. కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్!

Hyderabad: మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ.. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే..

ఆఫర్ లెటర్ ఇచ్చి వదిలేయం.. జాబ్‌లో చేరేవరకు మాదే గ్యారెంటీ.. మంత్రి అజారుద్దీన్ హామీ

ఇది మెట్రో స్టేషనా? తిరుమల క్యూ లైనా? హైదరాబాద్ వాన బీభత్సం విజువల్స్ చూస్తే షాక్ అవుతారు!

×