E-Paper
Advertisement

సిద్దిపేటలో పర్యావరణ వేడుకలు.. మంత్రి పొన్నం, ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు!

సిద్దిపేటలో పర్యావరణ వేడుకలు.. మంత్రి పొన్నం, ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు!
Advertisement

Siddipet: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని అర్బన్ ఆక్సిజన్ పార్క్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘చెట్టు విలువ తెలుసా’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించి, మొక్కలు నాటిన అనంతరం ప్రతి ఒక్కరితో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.

పర్యావరణం మన జీవితంలో భాగం కావాలి

Advertisement

పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదని, అది మన జీవితంలో భాగం కావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఢిల్లీ లాంటి కాలుష్య పరిస్థితులు తెలంగాణకు రాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జీరో టాక్స్‌తో ఈవీ (EV) పాలసీని తెచ్చారని గుర్తుచేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు, హోటళ్లకు గ్లాసులు పంపిణీ చేసి ప్లాస్టిక్ రహిత దిశగా అడుగులు వేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని, గ్రామాల్లో మొక్కల పెంపకంపై పోటీతత్వాన్ని పెంచి ఉత్తమ సర్పంచ్‌లను అభినందించాలని అధికారులకు సూచించారు.

ప్లాస్టిక్ నిషేధం ఇండ్ల నుంచే మొదలవ్వాలి

Advertisement

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వేగంగా విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్లాస్టిక్ నిషేధం ప్రతి ఇల్లాలు తన ఇంటి నుంచే ప్రారంభించాలని కోరారు. జనాభాకు తగ్గట్టుగా పచ్చదనం పెంచడాన్ని ఒక ఉద్యమంగా మార్చాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా భూసారాన్ని పరీక్షించి, రైతులు పంట మార్పిడి విధానంలో మిల్లెట్స్, పప్పు దినుసులు పండించాలన్నారు. మెదక్ – ఎల్కతుర్తి జాతీయ రహదారిపై ఈ ఏడాది లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా ఈ నెలలోనే భూంపల్లి క్రాస్ రోడ్ నుండి సిద్దిపేట వరకు రోడ్డుకు ఇరువైపులా 20 వేల మొక్కలు నాటుతామని ప్రకటించారు.

ఈ ఏడాది 17 లక్షల మొక్కల లక్ష్యం

జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యత కోసం 33 శాతం పచ్చదనాన్ని పునరుద్ధరించడం ఎంతో అవసరమన్నారు. గత ఏడాది వనమహోత్సవంలో 22 లక్షల మొక్కలు నాటి సంరక్షించామని, ఈ ఏడాది కోసం నర్సరీలలో 17 లక్షల మొక్కలను సిద్ధం చేశామని తెలిపారు. రైతులు ఆవు ఆధారిత వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపి సాధన రష్మీ పెరుమాళ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఎఫ్ఓ సంధ్యారాణి, అదనపు డిసిపి సుభాష్ చంద్రబోస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ధరిపల్లి చంద్రం, కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవీందర్, స్థానిక సర్పంచ్ బాలరాజుతో పాటు పలువురు అధికారులు, మహిళలు పాల్గొన్నారు. సాంస్కృతిక సారథి కళాకారుల పర్యావరణ గీతాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Also Read: ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

Related News

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×