Hyderabad News: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శాంతిదూత పరిచయం చేసుకున్న కేఏ పాల్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే నిత్యం వార్తల్లో ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కోసారి ఆయన చిక్కుల్లో పడిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొం టున్నారు. అదెలా అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
ఏపీ-తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు కేఏ పాల్ గురించి చెప్పనక్కర్లేదు. తనను తాను శాంతిదూతగా వర్ణించుకుంటారు. ఆ శాంతిలో ఒక్కోసారి ఆయన అంతర్గత లీలలు బయటకు వస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ పెట్టిన నుంచి అధికార-విపక్షాల అధినేతలను చీల్చి చెండాడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. తనతోపాటు వస్తే నేరుగా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిస్తానంటూ ఏ విషయాన్నైనా డైవర్ట్ చేయగల నేర్పరి.
ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేఏ పాల్‌కు తిరుగులేదు. ఈ విషయాన్ని ఆయన సహచరులు వీలు చిక్కినప్పుడల్లా చెబుతుంటారు. విషయం ఏదైనా అనర్గళంగా మాట్లాడుతుంటారు. ఒక్కోసారి ఆయనకు చిక్కులు తెచ్చిన సందర్భం లేకపోలేదు.
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన తనను లైంగికంగా వేధించారంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. కొన్నిరోజులుగా ఆయన తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో ప్రస్తావించింది. బాధితురాలు ఎవరోకాదు ఆయన ఆఫీసులో పని చేస్తున్న యువతి. లైంగిక ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను షీ టీమ్‌కు ఇచ్చింది బాధితురాలు.
ALSO READ: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే
ఈ కేసును పంజాగుట్ట పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేసింది షీ టీమ్స్. రేపో మాపో కేఏపాల్‌కు నోటీసులు రావడం ఖాయమని అంటున్నారు. అన్నట్లు.. కొన్నాళ్లుగా కేఏ పాల్ కనిపించలేదంటూ ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలు మాట్లాడుకుంటున్నారు. బహుశా వేధింపుల వ్యవహారం కావచ్చని అంటున్నారు. పోలీసుల విచారణలో ఆయన ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి.
అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాలో ముందుగా స్పందించే వ్యక్తి కేఏ పాల్. హెచ్ 1బీ వీసాల రుసుము వ్యవహారంపై శనివారం ఉదయం రీజనల్ నుంచి జాతీయస్థాయి మీడియా వరకు ఈ అంశంపై చర్చలు, డిబేట్లు. కానీ ఎక్కడా కేఏ పాల్ కనిపించలేదని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇంతకీ ఆయన ఇండియాలో ఉన్నారా? లేక విదేశాల్లో ఉన్నారా? అన్న అనుమానాలు లేకపోలేదు.