BigTV English

‎Manchu Lakshmi: అర్హ హైడ్రోజన్ బాంబ్… దెబ్బకు భయపడిపోయిన మంచు లక్ష్మీ!

‎Manchu Lakshmi: అర్హ హైడ్రోజన్ బాంబ్… దెబ్బకు భయపడిపోయిన మంచు లక్ష్మీ!

‎Manchu Lakshmi: టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి పలు సినిమాలలో హీరోయిన్గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అలాగే కొన్ని షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా మంచు లక్ష్మి సినిమాలలో అంతగా నటించకపోయినప్పటికీ తరచుగా ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది.


బాషతో పాపులర్..

ముఖ్యంగా ఆమె తన సినిమాల ద్వారా కంటి తన భాష ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది అని చెప్పాలి. తెలుగుని కాస్త స్టైలిష్ గా మాట్లాడడంతో పాటు, కొంచెం డిఫరెంట్ గా మాట్లాడడంతో ఈమె ఏది మాట్లాడినా కూడా అది వైరల్ అవుతూనే ఉంటుంది. దాంతో ఎక్కువగా ఆమె తన భాష విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ఎవరు ఎన్ని విధాలుగా ట్రోల్స్ చేసినా తను మాత్రం పట్టించుకోకుండా అలాగే మాట్లాడుతూ ఉంటారు మంచు లక్ష్మి.

‎ఇంతకీ మీరు తెలుగేనా..

‎ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో భాగంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచు లక్ష్మీ దక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే మంచు లక్ష్మి ని అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ మీరు తెలుగేనా అంటూ అడిగిన ఒక వీడియో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ విషయం గురించి స్పందించింది మంచు లక్ష్మి. ఈ మేరకు ఆ వీడియో గురించి మంచి లక్ష్మి మాట్లాడుతూ.. అర్హ మామూలు అమ్మాయి కాదు. నిజంగా ఆ అమ్మాయి అంటే నాకు భయం. ఎవరైనా సరే తీసి పడేస్తుంది. అర్హ వేసే కౌంటర్లకు తిరిగి మనం మాట్లాడలేము అనగా, వెంటనే యాంకర్ మిమ్మల్ని తెలుగేనా అని ప్రశ్నించింది కదా అనగా మంచు లక్ష్మీ నవ్వుతూ..

‎ ఇదంతా వాళ్ళిద్దరి ప్లాన్..

‎అవును ఇదంతా స్నేహా, బన్నీ ప్లాన్. ఎందుకంటే గతంలో కూడా అర్హ ఒకసారి అడిగింది. కానీ మొన్న కావాలనే నన్ను అమ్మాయి ఏదో అడుగుతుంది అంటావా వీడియో తీసుకుంటుంది అంటే అవునా సరే అడగమని నేను అన్నాను. అప్పుడు వీడియో తీస్తూ నన్ను తెలుగేనా అంటూ ప్రశ్నించింది. ఇది వాళ్ళిద్దరి పనే. అల్లు అర్జున్ కూడా మా ఇంట్లో చాలానే పనులు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేద్దామని అన్నాడు. అప్పుడు నేను వద్దులే బన్నీ మన వీడియోల కంటే ఈ వీడియోని ఎక్కువగా వైరల్ అయ్యేలా ఉంది అని అన్నాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. అర్హ చాలా తెలివిగల అమ్మాయి. ఎవరినైనా సరే తన మాటలతో బాగా ఆడుకుంటుంది. బన్నీ కూడా తనని చూసి భయపడతాడు అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: Teja Sajja: ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత ఆ రికార్డు సొంతం చేసుకున్న తేజ సజ్జ!


Related News

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Rajinikanth: రజినీకాంత్ ఆలయంలో నవరాత్రి పూజలు… ఇదేమీ అభిమానం రా సామి!

‎Katrina Kaif: పెళ్లైన నాలుగేళ్లకు తల్లి అవుతున్న హీరోయిన్… బేబీ బంప్ ఫోటో వైరల్!

Teja Sajja: ప్రభాస్, ఎన్టీర్ తరువాత ఆ రికార్డు సొంతం చేసుకున్న తేజ సజ్జ!

OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే!

Vedhika: బికినీలో కూడా నటిస్తా.. గట్టి కౌంటర్ ఇచ్చిన వేదిక.. ఏమైందంటే?

Bandla Ganesh: మరోసారి అల్లు అరవింద్‌పై బండ్లన్న కామెంట్స్‌.. అంతమాట అనేశాడేంటి..

Big Stories

×