OG Pre-release Event: పవన్ కళ్యాణ్ హీరోగా రానున్న మూవీ ఓజీ. ఈ మూవీ విడుదలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లకు రానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్లలో నిమగ్నమైంది యూనిట్. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఈ చిత్రం ప్రీరిలీజ ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఆదివారం సాయంత్రం ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్వయంగా వెల్లడించారు. ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్ సూచనలు కచ్చితంగా చెప్పారు.
ముఖ్యంగా రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, బీజేపీ విగ్రహం సర్కిల్, పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాలలో ఆంక్షలు అమలు కానున్నాయి. పైన పేర్కొన్న ప్రాంతాల్లో ఈ మార్గాల ద్వారా ప్రయాణించినట్లయితే ప్రయాణికులు అసౌకర్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. సాయంత్రం వేళ అటువైపు వెళ్లకపోవడమే మంచిది. ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్‌లో ‘ఓజీ’ వస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక తెలంగాణలో OG ప్రీమియర్ షో సెప్టెంబర్ 24 రాత్రికు పడే అవకాశముంది. పవన్ కల్యాణ్ వీరాభిమాని డైరెక్టర్ సుజిత్. దీంతో ఈ మూవీపై పవన్ అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
ALSO RAED: హైడ్రా కూల్చివేతలు.. ఈసారి గాజులరామారం వంతు
అందుకు తగ్గట్టుగా సాంగ్స్, బీజీఎం, గ్లింప్స్, టీజర్ వంటివి సినిమాపై అంచనాలను అమాంతం రెట్టింపు అయ్యాయి. కొద్దిరోజుల కిందట వచ్చిన ‘హరిహరవీరమల్లు’ ఫిల్మ్ ఆశించిన ఫలితం రాలేదు. OG పై పవర స్టార్ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.
సుజీత్ డైరెక్షన్‌లో ప్రభాస్‌తో వచ్చింది సాహో ఫిల్మ్. తెలుగులో ఆ చిత్రానికి పాజిటివ్ వైబ్ రాకపోయినప్పటికీ బాలీవుడ్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టిన విషయం తెల్సిందే. ఇక ఓజీ మూవీ టికెట్లు బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్, వెబ్‌సైట్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్కు మంచి స్పందన వచ్చింది. టికెట్లు హాట్ కేక్స్లా అమ్ముడుపోయినట్టు టాక్ నడుస్తోంది.