మూడో అంతస్తు నుంచి పడిన ఓ యువకుడు గాయాలతో బయటపడిన ఘటన రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరిగింది. వాటర్ తాగుతూ వెనక్కి నడిచిన ఆయన.. పొరపాటున పిట్టగొడ మీద నుంచి కిందపడిపోయాడు. మూడో అంతస్తు నుంచి పడిపోవడంతో చాలా మంది ఆయన చనిపోయాడని భావించారు. కానీ, ఓ మోస్తారు గాయాలతో ఆయన ప్రాణాలతో బటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జోధ్ పూర్ కు చెందిన 25 ఏళ్ల నజీర్ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. ఎప్పటి లాగే తన దుకాణంలో దుస్తులను పరిశీలిస్తున్నాడు. దాహం వేయడంతో వాటర్ బాటిల్ చేతిలో పట్టుకున్నాడు. తాగుతూ నెమ్మదిగా వెనక్కి నడిచాడు. సరిగా గమనించక బాల్కనీ గోడకు తగిలి బ్యాలెన్స్ కోల్పోయాడు. మూడో అంతస్తు నుంచి కిందపడిపోయాడు.
మూడో అంతస్తు నుంచి కింద పడిపోయిన ఆయన.. నేరుగా అతడు రోడ్డు మీద ఆపి ఉన్న స్కూటీ మీదపడ్డాడు. ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో స్కూటీ కీలకపాత్ర పోషించింది. స్వల్పగాయాలకు గురయ్యాడు. పాదంలో పగులు ఏర్పడింది. వెంటనే, స్పందించిన స్థానికులు అతడిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో కోలుకుంటున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటన దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Jodhpur, Rajasthan ‼️
A cloth merchant fell from the 3rd floor.
The entire incident was caught on CCTV. pic.twitter.com/MsXs8UqdlE— Deadly Kalesh (@Deadlykalesh) September 18, 2025
అటు ఈ ఘటనపై నెటిజన్లు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. భవనంలోని భద్రతా చర్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. “సేఫ్టీ గ్రిల్ లేకుండా ఇంత పేలవమైన బాల్కనీని కట్టించిన బిల్డర్ ను జైలులో పెట్టాలి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “డబ్బు ఆశ చూపితే ఎలాంటి నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోరు. అన్నీ సక్రమంగానే ఉన్నట్లు సర్టిఫై చేస్తారు. చిరవకు బలయ్యేది ఇలాంటి అమాయకులే” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “లంచం తీసుకుని ఇలాంటి భవనాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను కఠినంగా శిక్షించాలి” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఎవరు ఎన్ని చెప్పినా, అతడు లేచిన సమయం బాగా లేదు. అందుకే కిందపడిపోయాడు. అయినప్పటికీ అదృష్టం బాగుండి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు” అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.