Hyderabad:కళలకు ప్రాణం పోస్తూ ఎప్పటికప్పుడు నిర్వహించే కార్యక్రమాలు అటు ప్రజలలో ఇటు ప్రేక్షకులలో సరికొత్త జోష్ నింపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ వేదికగా హైదరాబాదు మోడల్స్ అద్వర్యంలో సెలబ్రిటీ డాండియా నైట్స్ – 2025 కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించనున్నారు. సెలబ్రిటీ డాండియా నైట్స్ తొమ్మిదవ సీజన్ మాదాపూర్ లోని HICC లో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 2025 వరకు దాదాపు 11 రోజుల పాటు ఈ వేడుకను నిర్వహించనున్నారు.
ఈ మేరకు HICC ప్రాంగణంలో శనివారం రోజు జరిగిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మోడల్స్ ఫ్యాషన్ డైరెక్టర్ వంశీ పల్లే, ఫెమినా మిస్ ఇండియా ఛత్తీస్గడ్ స్పందన పల్లి, సీనియర్ నటి క్యాథలిన్ గౌడ, రాఘవి మీడియా ఎండి మధుబాబులు సన్నాహక కార్యక్రమాల సెలబ్రిటీ డాండియా నైట్స్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సంగీతం, గ్లామర్, ఉత్సాహం, సాంప్రదాయం కలగలిపిన వేడుకలు జరగనున్నాయని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మోడల్స్ ఫ్యాషన్ డైరెక్టర్ వంశీ పల్లే మాట్లాడుతూ.. “ఈసారి ఈ వేడుకలు మరింత వైభవంగా జరగనున్నాయి లైవ్ సంగీత బృందాల ప్రదర్శనలు డీజే గర్భ ట్యూన్స్ ప్రదర్శనలతో పాటు సాంప్రదాయ ఢోల్ తడ్కా, థీమ్ డెకరేషన్లు, సంప్రదాయ ఆహార వంటల స్టాల్స్ తో పాటు సెలబ్రిటీల సందర్శనలు కూడా ఉంటాయని, ప్రతి రోజు ప్రత్యేక థీమ్ ఆధారంగా డాండియా ఆటలు, ఆకట్టుకునే బహుమతులు, కుటుంబాలు, యువతకు అనువైన సాంస్కృతిక అనుభూతిని అందించనున్నట్టు” ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఫ్యాషన్ మోడల్స్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఈ విషయాలు ప్రజలలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ALSO READ:Vedhika: బికినీలో కూడా నటిస్తా.. గట్టి కౌంటర్ ఇచ్చిన వేదిక.. ఏమైందంటే?