Katrina Kaif: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడితే మరి కొంతమంది కేవలం కొన్ని విషయాలను మాత్రమే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, విడాకులు, ప్రెగ్నెన్సీ, పిల్లలు వంటి విషయాలను పంచుకోవడానికి అంతగా ఆసక్తిని చూపించరు. కొందరు మాత్రం ప్రతి ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అయితే కొన్ని కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సెలబ్రిటీలు చేసి చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా అవి ఇట్టే తెలిసిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సంగతి పక్కన పెడితే సెలబ్రిటీలు పెళ్లి తరువాత కొంత మంది కొంతకాలం పాటు ఆగి ఆ తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించి అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. అలా పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ ఆలస్యంగా ప్లాన్ చేసుకున్న సెలబ్రిటీలలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే జంట కూడా ఒకరు.
బేబీ బంప్ ఫోటో..
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న హీరోయిన్ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ జంట ఒకటి. కాగా కత్రినా, విక్కీ ఇద్దరు మొదటిసారి 2019లో కలుసుకోగా, వారి మధ్య ఉన్న స్నేహం బలపడి ఈ కాస్త ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది. ఆ తర్వాత ఈ జంట డిసెంబర్ 9, 2021న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత నాలుగేళ్లలో పాటు గ్యాప్ తీసుకున్న ఈ జంట ఇప్పుడు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి గల కారణం కత్రినా కైఫ్ షేర్ చేసిన ఫోటో అని చెప్పాలి. ఆ ఫోటోలో కత్రినా కైఫ్ బేబీ బంప్ తో కనిపించింది.
తల్లి తండ్రులు కాబోతున్నారా?
దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కత్రినా కైఫ్ తల్లి కాబోతోందనీ, త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. మరి ఈ విషయంపై విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి . ఇకపోతే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ విషయానికి వస్తే.. విక్కీ ఇటీవల ఛావా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే ఊపుతో త్వరలో లవ్ అండ్ వార్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇక కత్రినా కైఫ్ “మేరీ క్రిస్మస్ “అనే సినిమాలో చివరగా నటించింది.
Also Read: Manchu Lakshmi: అర్హ హైడ్రోజన్ బాంబ్…దెబ్బకు భయపడిపోయిన మంచు లక్ష్మీ!