Rajinikanth: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో హీరోయిన్ల కోసం కొన్ని సార్లు అభిమానులు చేసే పని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తమ అభిమాన హీరో హీరోయిన్ల పుట్టినరోజులు లేదా వారి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో హీరో హీరోయిన్ల పట్ల అభిమానులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఎక్కువగా సెలబ్రిటీలకు గుడులు కడుతున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము.
ఇప్పటికే పలువురు హీరోయిన్లకు గుడి కట్టి పూజలు చేయడమే కాకుండా వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో రజనీకాంత్(Rajinikanth) కు కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక రజనీకాంత్ అభిమాని కార్తీక్(Karthik) అనే వ్యక్తి మధురైలో ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. నిత్యం ఈ ఆలయంలో పూజలు చేస్తూ రజనీకాంత్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం నవరాత్రి వేడుకలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కార్తీక్ ఏకంగా రజనీకాంత్ ఆలయంలో కూడా నవరాత్రి వేడుకలను(Navaratri Celebrations) ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బొమ్మల కొలువు ఏర్పాటు…
కార్తీక్ చిన్నప్పటి నుంచి కూడా రజనీకాంత్ కు వీరాభిమాని. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఆలయాన్ని నిర్మించి అందులో రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక నవరాత్రి వేడుకలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ ఆలయంలో రజనీకాంత్ ప్రతిమలతో బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువులో భాగంగా ఏకంగా 230 రజనీకాంత్ ప్రతిమలను 15వ వరుసలలో ఏర్పాటుచేసి నవరాత్రి వేడుకలను ప్రారంభించబోతున్నారు. సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రజనీకాంత్ ఆలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు.
#WATCH | Madurai, Tamil Nadu | Ahead of Navaratri starting on 22 September, a superfan of superstar Rajinikanth has set up a kolu featuring over 230 representations of the superstar’s iconic characters at the Rajini temple. (19.09) pic.twitter.com/pVWsps8zQ4
— ANI (@ANI) September 20, 2025
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై విభిన్న రీతిలో నెటిజన్లు స్పందిస్తున్నారు. సెలబ్రిటీలపై అభిమానం ఉండాలి కానీ మరి ఇలా గుడులు కట్టి నవరాత్రి ఉత్సవాలు జరపడం ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది మాత్రం రజనీకాంత్ పై చూపిస్తున్న అభిమానానికి ఫిదా అవుతున్నారు. ఇక రజనీకాంత్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఏడుపదుల వయసులో ఉన్నప్పటికీ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈయన చివరిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన కూలీ సినిమా(Coolie Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.
Also Read: Katrina Kaif: పెళ్లైన నాలుగేళ్లకు తల్లి అవుతున్న హీరోయిన్… బేబీ బంప్ ఫోటో వైరల్!