Hyderabad News: కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇన్నాళ్లు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. హైడ్రా రంగంలోకి దిగేసరికి అది మా భూమి అంటూ వాదించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీ శివారులోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది.
వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ- హైడ్రా ఉక్కుపాదం మోపింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేసింది. అయితే కబ్జాదారులు స్థానికులను గ్రూపుగా ఏర్పాటు చేసి ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం ప్రాంతంలోని సర్వే నంబర్ 307,342.329/1, 348లో 100 ఎకరాలకుపైగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు కబ్జాదారులు. తొలుత షెడ్లు ఏర్పాటు చేసిన కబ్జాబాబులు, ఆ తర్వాత ఏకంగా నిర్మాణాలపై ఫోకస్ చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ దాదాపు రూ.4000 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా.
కబ్జాదారులు ఆ స్థలాన్ని 60 నుంచి 120 గజాల వరకు ప్లాట్లుగా చేసి రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు విక్రయించడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం చివరకు హైడ్రా దృష్టికి వచ్చింది. దీనికితోడు స్థానికుల నుంచి భారీగా ఫిర్యాదు రావడంతో అధికారులు అప్రమత్తమైంది.
ALSO READ: వచ్చేవారం నోటిఫికేషన్? స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ చర్చ
శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టర్, హైడ్రా ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు. ప్రభుత్వ భూమిలో జరిగిన ఆక్రమణల తీరుని పరిశీలించారు. ఆదివారం ఉదయం భారీ భద్రత ప్రభుత్వ భూమిలో వెలిసిన షెడ్డు, గుడిసెలను కూల్చివేత మొదలుపెట్టారు.
అయితే అప్పటికే స్థలాలను కొనుగోలు నిర్మించుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు హైడ్రా సిబ్బంది-పోలీసులు వారిని మొత్తం చెప్పడంతో సైలెంట్ అయ్యారు. లక్షలు పెట్టి కోనుగోలు చేసుకున్న మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్వే నెంబర్ 307 342.329/1. 348లో 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కబ్జాదారులు
60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున విక్రయాలు
దీనిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి… pic.twitter.com/gi6eGXRB2v
— BIG TV Breaking News (@bigtvtelugu) September 21, 2025