
YS Sharmila | బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నాయకులపై పదునైన విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమీపిస్తుండడంతో ఆయన వేగంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిపక్ష నాయకులలో ఇంతవరకు కేసీఆర్ ఎప్పుడూ వైఎస్సా్ర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పేరు ప్రస్తావించలేదు.
కానీ సోమవారం నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో మొదటిసారి షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. సమైక్యవాదులు, పరాయి రాష్ట్రం వాళ్లు అంటూ షర్మిలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.
నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “నర్సంపేటకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. సమైక్యవాదులు వారి చెంచాలు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తామంటే.. మీరు నిరసన తెలిపారు. నిరసన తెలపడంతో వైఎస్ షర్మిల సుదర్శన్ రెడ్డి మీద పగ పట్టింది.. ఆయనను ఓడించాడానికి డబ్బు కట్టలు కూడా పంపిస్తదట. మరి షర్మిల డబ్బు కట్టలు గెలవాలా..? లేక మన మిషన్ భగీరథ మంచి నీళ్లు గెలవాలా..? మీరే ఆలోచించాలి. పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి డబ్బు సంచులు పంపి మనల్ని ఓడిస్తమంటే మనం ఓడిపోదామా..? మీరు ఆలొంచించాలి. ఆరునూరైనా మళ్లీ పోయిన సారి కంటే ఎక్కువ సీట్లతోనే బీఆర్ఎస్ గెలవబోతుంది. నర్సంపేటలో ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ సుదర్శన్ రెడ్డి గెలిపించాలి ” అని అన్నారు.
కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తొలి విడత ప్రచారం పూర్తి చేసి.. ఈ రోజు నుంచి రెండో దశ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక, అశ్వరావుపేటలో బహిరంగ సభలకు హాజరయ్యారు. సభలో ఆయన ఖమ్మం జిల్లా నేతలు పొంగులేటి, తుమ్మలను టార్గెట్ చేశారు. ఓ ఇద్దరు నేతలు ఖమ్మంలో అహకారంతో మాట్లాడుతున్నారని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆ తరువాత కేసీఆర్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు.
.
.
.