E-Paper
Advertisement

Congress Party: బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ..కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు

Congress Party: బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ..కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
Advertisement

Brs Mlc’s Join in Congress Party: తెలంగాణలో సంచలన రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.

ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్ పల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు.

Advertisement

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండె విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజ్ సారయ్య ఉన్నారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు పెరిగింది. మొత్తం మండలిలో సభ్యుల సంఖ్య 40 ఉండగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

వరుస పరాజయాలతో చతికిలపడిన బీఆర్ఎస్ పార్టీకి మనోధైర్యం నింపడానికి ఒకవైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తుండగా..మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా, ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేరోజు కాంగ్రెస్ గూటికి చేరడం బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ కొట్టినట్లు అయింది.

Advertisement

వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో సాధ్యం కాలేదు. ఒకవైపు ఈనెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం, మరోవైపు ఆషాఢమాసం రానుండడంతో ఆషాఢ అమావాస్యకు ముందు రోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాగా, రెండు రోజుల క్రితమే సీనియర్ నేత కె.కేశవరావు కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×