BigTV English

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ధనమే ధనం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ధనమే ధనం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశుల్లో ఏ రాశి వారికి ధనప్రాప్తి ఉంది.? ఏ రాశి వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.? అనే విషయాలపై జ్యోతిషులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మంచి సమయం. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.వ్యాపారులకు ఆర్థికలాభం ఉంటుంది. శుభవార్త వింటారు. దైవారాధన మానవద్దు.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కీలక సమయాల్లో డబ్బు చేరుతుంది. వ్యాపారాల్లో నిర్లక్ష్యం వహిస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులతో ఆచితూచి వ్యహరించాలి. చంద్రధ్యానం శుభప్రదం.


మిథునం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంది. ప్రారంభించిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు పొందుతారు. కోపం అదుపులో పెట్టుకోవాలి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వేంకటేశ్వర స్వామివారిని సందర్శించాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి ధర్మ సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో చేపట్టిన పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. స్నేహితుల నుంచి బహుమతులు వస్తాయి. శివారాధన శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంది. కీలక సమయాల్లో లక్ష్యాలను చేరుకునేందుకు శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల వారు జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం సాధిస్తారు. ఆంజనేయస్వామి వారిని సందర్శిస్తే మంచిది.

కన్య:
ఈ రాశి వారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు. డబ్బు కొరత ఉంటుంది. ప్రారంభించి పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కలహాలకు దూరంగా ఉంటే మంచిది. అనవసర విషయాలపై ఆలోచన చేయకపోవడం మంచిది. అడ్డంకులు ఎదురుకావొచ్చు. లక్ష్మీ గణపతి ఆరాధన మంచిది.

తుల:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంది. ఇతరుల నుంచి ఆటంకాలు ఎదురుకావొచ్చు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. సమయాన్ని వృథా చేయకూడదు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శివారాధన ఉత్తమం.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఇష్టమైన వారితో సమయం కేటాయిస్తారు. ఖర్చులపై జాగ్రత్తలు అవసరం. ఆందోళనను దరిచేరనీయవద్దు. పెట్టుబడిలో ఆచితూచి వ్యవహరించాలి. చంద్ర ధ్యానం ఉత్తమం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాల్లో మీ ఆలోచనతో విజయం సాధించి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విష్ణు ఆరాధన శుభప్రదం.

మకరం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. గతంలో పెండింగ్ పనులు సైతం పూర్తవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధన, వస్త్ర లాభాలు వరిస్తాయి. వివాహితులు శుభవార్త వింటారు. వ్యాపారాల్లో ధనవర్షం కురుస్తుంది. సూర్య నమస్కారం చేస్తే మంచిది.

కుంభం:
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అనుకూలంగా ఉన్న వాళ్లే వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాల్లో సలహాలు తీసుకోవడం ఉత్తమం. ప్రయాణాలు ఫలిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అష్టలక్ష్మీస్తోత్రం చదివితే మంచిది.

మీనం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మంచి పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించాలి. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం అవసరం. కీలక నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. గురు ధ్యానం మంచిది.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×