
Diwali Accidents : దీపావళి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బాణాసంచా కాలుస్తుండగా అప్రమత్తంగా ఉండకపోవడంతో ఒకరు అగ్నికి ఆహుతి కాగా.. మరోకరి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది.
హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని వెంటకేశ్వర అపార్ట్‌మెంట్స్‌లో బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదవశాత్తు చీర అంటుకొని రాఘవమ్మ అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకుంది. మంటలు ఆర్పే క్రమంలో భర్త రాఘవరావుకు కూడా మంటలు అంటుకొని మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన భార్య కూడా 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
హైదరాబాద్ లోని సరోజని దేవి ఆసుపత్రిలో నిన్న రాత్రి చాలా మంది బాధితులు చేరారు. వీరంతా నిర్లక్ష్యంగా బాణాసంచా కాల్చడంతో గాయాలైన వారే. ఇక గాయపడ్డ వారిలో చాలా మంది పెద్దవారే ఉన్నారు.
ఇన్ పేషేంట్ వార్డులో ఐదుగురు.. చిన్నపిల్లల వార్డులో ఒకరు అడ్మిట్ అయ్యారు. కార్నియా డిపార్ట్మెంట్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఉదయం మూడు గంటల వరకు ఓపిలో 50 కేసులు నమోదైనట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ రాజుగారివీధిలో భారీ ప్రమాదం తప్పింది. బాణసంచా కాలుస్తుండగా ముళ్లపొదల్లో నిప్పురవ్వలు పడటంతో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదంటున్నారు స్థానికులు.
తిరుపతిలో కూలర్స్ గోడౌన్ అవరణంలో అగ్ని ప్రమాదం జరిగింది. అరుబయట పాత కూలర్స్ పై నిప్పు రవ్వలు పడటంతో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పాత కూలర్స్,ప్రిజ్ లు అగ్నికి ఆహుతయ్యాయి. పైర్ ఇంజన్ సాయంతో మంటలను ఆర్పివేశారు.
గుంటూరులోని గౌరీ శంకర్ థియేటర్ రోడ్ లోని ఒక ఆటోమొబైల్ స్పేర్స్ దుకాణంలో లో అగ్నిప్రమాదం జరిగింది.
విశాఖలోని గాజువాకలోని స్క్రాప్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. చుట్టూ దట్టమైన పొగలు అల్లుకోవడంతో జనం పరుగులు పెట్టారు.