E-Paper
Advertisement

Viral Video: టర్కీలో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి.. వీడియో వైరల్

Viral Video: టర్కీలో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి.. వీడియో వైరల్

EasyJet: టర్కీ ఈజీజెట్ విమానంలో తాగిన మత్తులో ఓ ప్రయాణికుడు ఎయిర్‌లైన్ సిబ్బందిపై దాడి చేశాడు. ప్రక్కనే ఉన్న ప్రయాణికుడిపై మొదట దాడి చేయగా అనంతరం అక్కడకు వచ్చిన సిబ్బందితో పాటు పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రయాణికుల్లో ఒకరు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.

టర్కీలో ఈజీ జెట్‌ విమానం ల్యాండ్‌ అయిన కాసేపటికే మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు విమానం పై కప్పును బాదుతూ ప్రక్కనే ఉన్న మరో వ్యక్తితో గొడవకు దిగాడు. అది గమనించి టర్కీ పోలీసు అధికారితో పాటు మహిళా ఎయిర్‌లైన్‌ ఉద్యోగి అతడు కూర్చున్న సీటు వద్దకు రాగా వారిపై ఆ ప్రయాణికుడు దాడి చేశాడు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే  ఉన్నతాధికారులకు సమాచారం అందించగా..అక్కడకు చేరుకున్న అధికారులు అతడిని విమానం నుంచి బయటకు పంపించారు.

ఏప్రిల్ 20 వ తేదీన ఎడిన్‌బర్గ్‌ నుంచి విమానం టర్కీ బయలు దేరింది. అయితే  మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఫ్లైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్కాటిష్‌ ఫుట్‌బాల్‌ చూస్తూ గట్టి గట్టిగా అరుస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన ఓ ప్రయాణికుడు సైలెంట్ గా ఉండాలని కోరాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు వ్యక్తి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. అతడితో పాటు వారి సీటు వద్దకు వచ్చిన పోలీసు, సిబ్బందిపై దాడి చేశాడు.

Also Read: నోట్లో నిప్పు పెట్టుకుని స్టంట్స్.. కొంచెంలో తప్పిన పెను ప్రమాదం

విషయం తెలుసుకున్న ఈజీజెట్‌ అధికారులు ఈ ఘటనపై స్పందించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తమ సిబ్బంది వివిధ రకాల మనస్తత్వాలు కలిగి ఉన్న ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో శిక్షణ పొందారని తెలిపారు. త్వరలోనే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags

Related News

సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా? సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

స్వయంకృషితో ఎదిగి… స్వ‌యంకృతాప‌రాధంతో త‌ల్ల‌డిల్లి!

మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

Big Stories

×