E-Paper
Advertisement

Viral Video: నోట్లో నిప్పు పెట్టుకుని స్టంట్స్.. కొంచెంలో తప్పిన పెను ప్రమాదం

Viral Video: నోట్లో నిప్పు పెట్టుకుని స్టంట్స్.. కొంచెంలో తప్పిన పెను ప్రమాదం
Advertisement

Viral Video: ఏంటో ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు అంటే చాలు ఏదో ఒక విన్యాసాలు చేసి ఫేమస్ అవ్వాలని చూస్తూనే ఉన్నారు. పెళ్లిళ్లేంటి ఏ పండుగలు అయినా, ఫంక్షన్లు అయినా సరే ఏదో ఒక పనితో ఫేమస్ అవ్వాలని అనుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో కొన్ని వినూత్న పనులతో కొంత మంది ఫేమస్ అవుతున్నా మరికొంత మంది మాత్రం వారు చేసే పనులు బెడిసికొట్టి బొక్కబోర్లా పడుతున్నారు. తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు విన్యాసాలు చేద్దాం అని చూసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్ లో ఓ భయానక ఘటన వెలుగుచూసింద. ఓ పెళ్లి వేడుకలో షాపూర్ కు చెందిన హర్షల్ చౌదరి అనే యువకుడు విన్యాసాలు చేయాలని చూశాడు. కానీ చివరికి అది కాస్త బెడిసికొట్టింది. తృటితో పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో భయటపడ్డాడు. అయితే హర్షల్ నోటిలో నుంచి మంటలను ఊదాలని ప్రయత్నించాడు. దీనికోసం నోట్లో మొదట పెట్రోల్ పోసుకున్నాడు. అనంతరం నోటికి నిప్పు పెట్టుకుని ఊదాలని చూశాడు. దీంతో ఒక్కసారిగా నోటిలోని మంటలు ముఖానికి అంటుకున్నాయి.

Advertisement

ముఖానికి అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన హర్షల్ అరచేతికి, గడ్డంకు కూడా అంటుకున్నాయి. దీంతో అక్కడే ఉన్న కొంత మంది స్థానికులు వెంటనే మంటలు ఆర్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×