E-Paper
Advertisement

Odisha: ఒడిశాలో మద్యం వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు.. బీరువాల్లో నోట్లకట్టలు

Odisha: ఒడిశాలో మద్యం వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు.. బీరువాల్లో నోట్లకట్టలు
Advertisement

Odisha: ఇటీవల వరుసగా పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలో సోదాలు నిర్వహించేందుకు వెళ్ళిన ఐటీ శాఖ అధికారులకు బీరువాల నిండుగా నోట్ల కట్టలు దర్శనమివ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒడిశా లోని పలువురు మద్యం వ్యాపారులు ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారనే సమాచారంతో.. ఐటీ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు.

తాజాగా టిట్లాగఢ్‌ పట్టణంలో ఉంటున్న దీపక్‌ సాహు, సంజయ్‌ సాహు, రాకేశ్‌ సాహుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బీరువాల నిండా పేర్చి ఉన్న నోట్లకట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. దాదాపు 510 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 20 ప్రాంతాలతో పాటు ఝార్ఖండ్‌, కోల్‌కతాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది.

Advertisement

మరోవైపు రాయగడ గాంధీనగర్‌లో ఉంటున్న మద్యం వ్యాపారి అరవింద్‌ సాహు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ ఎంత నగదు దొరికిందో అధికారుల ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×