E-Paper
Advertisement

Sangareddy: సంగారెడ్డిలో బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Sangareddy: సంగారెడ్డిలో బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం
Advertisement

Sangareddy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భూదేరా శివారులో అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి హైదరాబాద్-ముంబై హైవేపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే పక్కకు బస్సు ఆపేయడంతో ప్రయాణికులు వెంటనే దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

బస్సులో ఉన్న ప్రయాణికుల వస్తువులు బూడిదయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఇక ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. ఒకవేళ డ్రైవర్‌ అప్రమత్తం కాకపోయింటే? కాసింత నిర్లక్ష్యంగా ఉండి ఉంటే ? పరిస్థితి ఊహిస్తుంటేనే.. ఒళ్లు వణుకుపుడుతోందని.. పదుల సంఖ్యలో ప్రాణాలు బూడిదయ్యేవని ప్రయాణికులు అంటున్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నామని చెబుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×