BigTV English

Summer Vacation: సమ్మర్‌లో ఈ ప్లేస్‌కి వెళ్తే వచ్చే కిక్కే వేరప్పా..!

Summer Vacation: సమ్మర్‌లో ఈ ప్లేస్‌కి వెళ్తే వచ్చే కిక్కే వేరప్పా..!

Summer Vacation: సమ్మర్‌లో ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి కాస్త కూల్‌గా ఉండే ప్లేస్ ఏదైనా ఉంటే అలా ఓ ట్రిప్ వేసి రావాలని చాలా మందికి అనిపిస్తుంది. కానీ, వేసవి అంటే తెలుగు రాష్టాల్లో ఎక్కడ చూసినా ఎండలు మండిపోతాయి. ఇక చల్లగా ఉండే ప్లేస్‌కి వెళ్లి అలా ఎంజాయ్ చేద్దాం అంటే ఎక్కడో నార్త్ ఇండియాలో ఉన్న హిమాలయాలకు వెళ్లాలా అనిపిస్తుంది. అయితే, అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌత్ ఇండియాలోనే చాలా చల్లగా ఉండే ప్రదేశం ఉంది. సమ్మర్‌లో ఓ లాంగ్ బ్రేక్ తీసుకొని చిల్ అవ్వాలని అనుకునే వారికి తమిళనాడులో ఉన్న ఊటీ బెస్ట్ ఆప్షన్.


ఈ సమయంలో ఊటీకి వెళ్తే ప్రకృతి అందాలు, చల్లని గాలులు, చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణం ఆహ్లాదభరింతంగా అనిపిస్తాయి. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి ఓ మంచి రిలాక్సింగ్ ట్రిప్‌కి వెళ్లాలి అనుకుంటే మాత్రం వెంటనే ఊటీకి టికెట్స్ బుక్ చేసుకోండి.

సమ్మర్ కావడంతో ఇప్పటికే ఈ హిల్ ష్టేషన్‌కు చాలా మంది పర్యటకులు క్యూ కడుతున్నారు. ‘నీలగిరి రాణి’గా పేరుగాంచిన ఊటీ, ప్రకృతి ప్రేమికులకు, హిమశీతల వాతావరణాన్ని అందిస్తుంది. ఇతర ప్రాంతాల్లో వేసవిలో ఎండల ప్రభావం ఎంత ఎక్కువగా ఉన్నా ఊటీలో మాత్రం ఉష్ణోగ్రతలు 25°Cకు మించదట. పచ్చని టీ తోటలు, కొండలపై మబ్బులు తేలియాడుతూ కనిపిస్తాయి.


ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో లక్షల మంది పర్యాటకులు ఊటీకి వెళ్తారట. చెన్నై, కోయంబత్తూరు, బెంగుళూరు వంటి నగరాల నుంచి రైలు, బస్సు, కార్ల ద్వారా వచ్చిన వారితో ఊటీ సందర్శన కేంద్రాలు కిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా ఊటీ లేక్, బోటానికల్ గార్డెన్, దొదబెట్టా, రోజ్ గార్డెన్, సిమ్స్ పార్క్ వంటి ప్రదేశాలలో పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుందట.

ALSO READ: పాము ఆకారంలో గుడి..

ఊటీ ఒకప్పుడు బ్రిటిష్ అధికారుల వేసవి నివాసంగా ఉండేదట.అంతేకాకుండా చాలా జంటలకు ఊటీ ఒక రొమాంటిక్ డెస్టినేషన్‌గా మారిపోయింది. కొండల్లో మిస్ట్‌, టీఫ్యాక్టరీల్లో చాయ్‌ టేస్టింగ్‌, హార్స్ రైడింగ్‌ వంటి ఎన్నో యాక్టివిటీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి అంటే ప్రేమ, చిన్న చిన్న అడ్వెంచరస్ ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఊటీకి వెళ్లడం బెటర్.

ఊటీలో ఉండే ఫుడ్ కూడా చాలా బాగుటుంది. టీఫ్యాక్టరీలో నేరుగా టీ ప్రాసెసింగ్‌ చూసి, అప్పుడే తయారైన టీ తాగొచ్చట. అలాగే, స్థానిక చాక్లెట్లు, ఊటీ మార్కెట్‌లో దొరికే చక్కటి చేతివృత్తి వస్తువులు, అరుదైన అరోమాటిక్ ఆయిల్స్ కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

ఎలా వెళ్లాలి?
ఊటీకి వెళ్లాలి అనుకునే వారు ముందుగా మెట్టుపాళయం చేరుకోవాల్సి ఉంటుంది. చెన్నై, కోయంబత్తూర్, సేలం, బెంగుళూరు నుంచి మెట్టుపాళయం వరకు రెగ్యులర్ రైళ్లు ఉంటాయి. అక్కడి నుంచి ఊటీ వరకు 5 గంటల ప్రయాణం ఉంటుంది. వేసవి సీజన్‌లో ఊటీకి వెళ్లే వారు ముందుగానే హోటళ్లను బుక్ చేసుకోవడం ఉత్తమం. గెస్ట్‌హౌసులు, హోమ్‌స్టేలు, రిసార్ట్‌లు అన్నీ అందుబాటులో ఉంటాయి.

Related News

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Big Stories

×