Suniel KL Rahul: టీమిండియా క్రికెటర్ కె.ఎల్ రాహుల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు రాహుల్. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2025 సీజన్ లోను అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక ఇటీవలే రాహుల్ – అతియా శెట్టి దంపతులు పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కే.ఎల్ రాహుల్ దంపతులతో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాహుల్ మామ గారైన సునీల్ శెట్టి తాతగా ప్రమోషన్ పొందడంతో ఆనందంలో మునిగితేలుతున్నాడు.
Also Read: SRH vs MI: ముంబైని ఉ***చ్చ పోయించడానికి వచ్చాం.. SRH వార్నింగ్
మనవరాలు తన జీవితంలోకి అడుగు పెట్టాక కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులు, ఆటగాళ్లు ఎక్కువగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, కేఎల్ రాహుల్ సంయుక్తంగా ఏడు ఎకరాల భూమిని పశ్చిమ థానేలోని ఓవలే ప్రాంతంలో కొనుగోలు చేశారు. ముంబై ని అనుకొని ప్రధాన ఏరియాలో 10 కోట్ల ధరకు ఈ ఏడు ఎకరాలను కొనుగోలు చేశారు.
అయితే ఈ ఏడు ఎకరాలు రాబోయే పదేళ్లలో 50 కోట్లు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే అభివృద్ధికి చేరువలో ఉన్న ఔట్ స్కర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కావడంతో.. ఈ డీల్ పై చాలా చర్చ సాగుతోంది. 2025 మార్చ్ లో నమోదైన ఈ లావాదేవీల ప్రకారం.. 30 ఎకరాల 17 గుంటల పెద్ద ఫ్లాట్ లో ఈ ఏడు ఎకరాలు భాగం అని తెలుస్తోంది. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ఈ ఒప్పందాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ డీల్ స్టాంప్ డ్యూటీ ఖర్చులు రూ. 68 లక్షల 96 వేలు కాగా.. రిజిస్ట్రేషన్ ఖర్చులు దాదాపు 30 వేల వరకు అయ్యాయని సమాచారం.
Also Read: Indian Coaching staff: బీసీసీఐ సంచలన నిర్ణయం… ఆ ఇద్దరి ఉద్యోగాలు పీకేశారు
ఇక 2024లో కేఎల్ రాహుల్ అతడి భార్య అతియా శెట్టి బాంద్రాలోని పాలీ హిల్ లో 20 కోట్లకు 3, 350 చదరపు అడుగుల అపార్ట్మెంట్ ని కొనుగోలు చేశారు. అదే సమయంలో సునీల్ శెట్టి, అతడి కుమారుడు అహన్ శెట్టి {Ahan} “ఖార్” ప్రాంతంలో రూ. 8.01 కోట్లకు 1,200 చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేశారు. ఇక ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఈ సీజన్ ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ.. రూ. 14 కోట్లకు కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు రాహుల్ ఆడిన 4 మ్యాచ్లలో 200 వరకు పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడగా.. ఇందులో నాలుగు మ్యాచ్లలో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది.