UP Crime News: అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. అగ్నిసాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేస్తున్నారు కొందరు మహిళలు. ఆ రొంపిలో పడి చివరకు భర్తను చంపేసి డ్రామాలు ఆడుతున్నారు. తాజాగా తన రొమాన్స్‌కు అడ్డు ఉన్నాడని భర్తని లేపేసింది భార్య. పైగా భర్తను పాము కరిచిందంటూ కొత్త డ్రామాకు తెరలేపింది. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.
స్టోరీలోకి వెళ్తే..
మీరట్‌లోని అక్బర్‌పూర్ సదాత్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అమిత్‌కు రవితకు పెళ్లి అయ్యింది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అమిత్ భార్యకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే తన రొమాన్స్‌కు భర్త అడ్డువస్తున్నాడని భావించింది. ఆయన ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదని డిసైడ్ అయ్యింది.
ఈ క్రమంలో కొత్త స్కెచ్ వేసింది. ఏప్రిల్ 14న రాత్రి మంచంపై నిద్రిస్తున్న భర్తను చంపేసింది. పాము కాటేయడంతో తన భర్త మరణించాడని కొత్త డ్రామా మొదలుపెట్టింది. దీనిపై అనుమానం వచ్చిన అమిత్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగేశారు. పోస్టుమార్టం నిమిత్ం బాడీని ఆసుపత్రికి తరలించారు.
రిపోర్టు ఏం చెప్పింది?
విషం వల్ల చనిపోలేదని, కేవలం ఊపిరి ఆడకపోవడం వల్లే మృతి చెందాడని రిపోర్టులో వెల్లడైంది. ఆ రిపోర్టును చూసి ఖంగుతిన్నారు పోలీసులు. వెంటనే విచారణ మొదలుపెట్టిన పోలీసులు రవితను తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది.
ALSO READ: భార్యతో గొడవ, మరదలిపై కక్ష తీర్పుకున్న భర్త
రవితకు అదే గ్రామానికి చెందిన అమర్‌జీత్‌తో ఏడాదిగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయం తెలిసి భార్యను మందలించాడు అమిత్. భార్య తీరు ఏ మాత్రం మారలేదు. ఫలితంగా ఆ ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ప్రియుడు అమర్‌జీత్‌తో కలిసి భర్తను కడ తేర్చాలని రవిత ప్లాన్ చేసింది. అమర్ సాయంతో నిద్రిపోతున్న అమిత్ గొంతు నులిపి చంపేసింది.
డ్రామాలోకి పాములోడు
ఓ పామును మంచం మీద పడేసింది. అందుకుగాను ఆ పాములోడికి వెయ్యి రూపాయలు ఇచ్చింది. పాము కాటు వల్లే తన భర్త చనిపోయాడని ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికులు సమాచారం మేరకు పాములు పట్టేవాడు వచ్చి మంచంపై ఉన్నదాన్ని తొలగించాడు.
జనం కూడా పాము కాటు వల్లే అమిత్ చనిపోయాడని నమ్మారు. రెండురోజుల కిందట ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. చాలామంది బాధపడ్డారు కూడా. ప్రస్తుతం రవిత, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.