E-Paper
Advertisement

బంజారాహిల్స్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.. లగ్జరీ ప్లేస్ గా ఎలా మారిందంటే?

బంజారాహిల్స్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.. లగ్జరీ ప్లేస్ గా ఎలా మారిందంటే?
Advertisement

Untold History of Banjara Hills: హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బంజారా హిల్స్ ఒకటి. విలాసవంతమైన ఇళ్లు, స్టార్ హోటళ్లు, ప్రముఖుల నివాసాలు, కార్పొరేట్ ఆఫీస్ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే  ఎన్నో ప్రత్యేకతలతో ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ, ఈ ప్రాంతానికి ‘బంజారా హిల్స్’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? దాని వెనుక ఉన్న చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దట్టమైన అడవి.. చుట్టూ గుట్టలు..

చాలా ఏళ్ల క్రితం ఈ ప్రాంతం పూర్తిగా దట్టమైన అడవులు, చిన్న చిన్న కొండలతో నిండి ఉండేది. అప్పట్లో ఇక్కడ సంచార జీవనం సాగించే బంజారాలు, లంబాడీ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసించేవారు. వారి పేరునే ఈ ప్రాంతానికి ‘బంజారా హిల్స్’ అని నామకరణం చేసిటనల్ చరిత్ర చెబుతోంది. కాలం గడిచేకొద్దీ ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిజాం పాలనలో మంత్రిగా పనిచేసిన నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 1927లో ఆయన ఇక్కడి బంజరు భూమిని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు చారిత్రక వివరాలు చెబుతున్నాయి. ఆ తర్వాత 1930 ప్రాంతంలో ఆయన ఇక్కడ ‘కోహిస్తాన్’ అనే ప్రత్యేక శైలిలో నివాసాన్ని నిర్మించారు. ఈ భవనం అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అనంతరం తన స్నేహితులు, ప్రముఖులు కూడా ఈ ప్రాంతంలో స్థిరపడేలా ప్రోత్సహించారు. తక్కువ ధరలకు భూములు ఇవ్వడంతో క్రమంగా ఈ ప్రాంతంలో నివాసాలు పెరిగాయి.

నిజాం పేరును కాదని మరీ..

Advertisement

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ ప్రాంతానికి తన పేరును పెట్టాలని నిజాం సూచించినప్పటికీ, ఇక్కడ మొదట నివసించిన బంజారాలు కాబట్టి.. వారి గౌరవార్థం ‘బంజారా హిల్స్’ అనే పేరే ఉండాలని నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ సూచించినట్లు చెబుతారు. ఈ నేపథ్యంలో ఆ పేరు శాశ్వతంగా స్థిరపడిపోయింది. కాలక్రమేణా బంజారా హిల్స్ హైదరాబాద్‌లో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారింది.

Read Also: ఇన్నాళ్లు తార్నకలో తిరిగాం.. కానీ, ఈ పేరు వెనుక ఇంత చరిత్ర ఉందని తెలియదే!

ఆధునిక బంజారాహిల్స్ గురించి..

Advertisement

నేడు ఇక్కడ ఫైవ్ స్టార్ హోటళ్లు, ప్రముఖ ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాలు, విలాసవంతమైన రెస్టారెంట్లు ఉన్నాయి. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు నివసించే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు అడవిగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలతో దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. .

మనం ప్రతిరోజూ వినే ప్రాంతాలే అయినా, వాటి పేర్ల వెనుక ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉందని హైదరాబాద్ లో ప్రస్తుతం నివసిస్తున్న చాలా మందికి తెలియదు. బంజారా హిల్స్ కూడా అలాంటి ప్రత్యేక చరిత్రను తనలో దాచుకుంది. అందుకే ఈ ప్రాంతం కేవలం విలాసవంతమైన ఏరియా మాత్రమే కాదు… హైదరాబాద్ చరిత్రను గుర్తు చేసే ఒక చిరస్మరణీయ ప్రదేశంగా నిలిచిపోయింది.

Read Also:  ఏంటీ.. గచ్చిబౌలి చరిత్ర ఇదా, ఆ పేరు రావడానికి కారణం ఇదేనట.. అద్భుతం కదూ!

Related News

అరకు వ్యాలీ నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వరకు.. వర్షాకాలంలో అందంగా కనిపించే 4 లోయ ప్రాంతాలు

ఈ దేశాల్లో ప్రజలు పాములనే ఎందుకు తింటారు? సాంప్రదాయమా? ఆరోగ్యం కోసమా?

స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు? దీని వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా?

నల్లగొండ జిల్లాలో ఇంత అందమైన జలపాతం ఉందా? వర్షాకాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

Gachibowli History: ఏంటీ.. గచ్చిబౌలి చరిత్ర ఇదా, ఆ పేరు రావడానికి కారణం ఇదేనట.. అద్భుతం కదూ!

తక్కువ బడ్జెట్‌లో వర్షాకాల ట్రిప్.. భారత్‌లో అందమైన ప్రదేశాల టూర్ సగం ధరలోనే

టికెట్ లేకున్నా వారిని రైల్లో నుంచి దించకూడదట, ఇండియన్ రైల్వేలో చాలామందికి తెలియని సేఫ్టీ రూల్..

Big Stories

Advertisement
×