E-Paper
Advertisement

రైలు బోగిలో ఫస్ట్ నైట్ పై స్పందించిన రైల్వే.. వాళ్లకు దబిడి దిబిడే!

రైలు బోగిలో ఫస్ట్ నైట్ పై స్పందించిన రైల్వే.. వాళ్లకు దబిడి దిబిడే!
Advertisement

Honeymoon-Themed Train Cabin Controversy: రైలులో ఫస్ట్ క్లాస్ ఏసీ కూపేను హనీమూన్ సూట్‌లా అలంకరించిన ఘటన దేశ వ్యాప్తంగా ఆశ్చర్యం కలిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ ను సస్పెండ్ చేయడంతో పాటు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తాజాగా వైరల్ అయిన వీడియోలో ఫస్ట్ ఏసీ కూపే మొత్తం బెలూన్లు, పూలతో ప్రత్యేకంగా అలంకరించి కనిపించింది. లవ్ షేప్ రిబ్బన్లు, పైభాగం నుంచి వేలాడుతున్న బెలూన్లు, వాల్స్ కు అమర్చిన పూల గుచ్ఛాలు,  ఐ లవ్ యూ అనే అక్షరాలు, బెర్త్‌ లపై, నేలపై పూల రేకులు చల్లి మొత్తం కూపేలగ్జరీ హనీమూన్ గదిలా మార్చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు, రైల్వేలో ఇలాంటి అలంకరణకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.

Advertisement

ఈ ఘటన జూలై 6న నందిగ్రామ్ ఎక్స్‌ ప్రెస్‌ లో జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న ఓ కొత్త జంట తమ ఫస్ట్ ఏసీ కూపేను ప్రత్యేకంగా అలంకరించుకోవాలని భావించి, ఒక ఆన్‌ లైన్ ప్లాట్‌ ఫారమ్ ద్వారా ప్రైవేట్ డెకరేటర్‌ ను సంప్రదించినట్లు అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి రైలులోకి వెళ్లి కూపేను అలంకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, రైలులోకి ఇలా అనధికారికంగా వెళ్లడం రైల్వే నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ, సంబంధిత సీటీఐపై సస్పెన్షన్ విధించింది. అలాగే ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరి అనుమతితో డెకరేటర్ రైలులోకి వెళ్లాడు? భద్రతా నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదు? అనే అంశాలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.

రైల్వే కీలక వివరణ

Advertisement

దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఎ. శ్రీధర్ ఈ ఘటనపై స్పందించారు. మహారాష్ట్రలోని జల్నా స్టేషన్ దగ్గర డెకరేటర్ రైలులోకి వెళ్లి డెకరేషన్ చేసినట్లు గుర్తించామని చెప్పారు. అందుకే వెంటనే శాఖాపరమైన చర్యలు ప్రారంభించామన్నారు. అంతేకాకుండా, డెకరేటర్‌ పై కూడా రైల్వే నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. టికెట్ లేకుండా రైలులోకి ప్రవేశించడం, అనుమతి లేకుండా కోచ్‌ లోకి వెళ్లడం, రైల్వే నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అతడిని కూడా విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు.

డెకరేటర్ వాంగ్మూలం, ఇతర సిబ్బంది వివరణలు, సీసీటీవీ దృశ్యాలు, అందుబాటులో ఉన్న ఆధారాలన్నింటిని పరిశీలించిన తర్వాత తుది నివేదిక సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  ఒక వీడియోతో ప్రారంభమైన ఈ వ్యవహారం ఇప్పుడు రైల్వే భద్రత, నిబంధనల అమలుపై పెద్ద చర్చకు దారితీసింది. చివరకు ఈ ఘటనలో అసలు బాధ్యులు ఎవరు? విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Also: రైలులో ఫస్ట్ నైట్.. ఫస్ట్ ఏసీ క్లాసులో బెడ్, అబ్బో ఏం సెట్ చేశారయ్యా!

Related News

దేశంలో ఫస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ.. వందే భారత్‌కు మించి వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు!

సముద్రంలో ఈ పసుపు గుర్తు కనిపిస్తే జాగ్రత్త! ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి ఎందుకు చేశారు? కారణాలేంటీ?

బ్రిటీషర్ల నాటి వైభవం.. మన దేశంలోనూ ‘లండన్’ ఉందోచ్.. విశేషాలు ఇవే!

మెట్రో రైలుకు గ్లోబల్ గుర్తింపు, ఆ సర్టిఫికేషన్ సాధించిన తొలి సంస్థగా..

అమృత్ భారత్ రైళ్లలో సూపర్ స్పెసిలిటీస్.. వెర్షన్ 3.0 చూస్తే మతిపోవాల్సిందే!

రాఖీ పండుగ వేళ రైల్వే గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్!

రైల్వే బెడ్‌ షీట్లు కొట్టేసి.. శాలువాలుగా కప్పుకొని.. నెట్టింట వీడియో వైరల్!

Big Stories

Advertisement
×