E-Paper
Advertisement

బయ్యర్లకు డబ్బులు ఇచ్చేసిన నిర్మాత.. ‘జన నాయగన్ ‘మూవీ రిలీజ్ లేనట్లేనా..?

బయ్యర్లకు డబ్బులు ఇచ్చేసిన నిర్మాత.. ‘జన నాయగన్ ‘మూవీ రిలీజ్ లేనట్లేనా..?
Advertisement

Jana Nayagan : కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఏం విజయ్ దళపతి నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’. ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ భారీ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఈ హీరో సీఎం అయిన తర్వాత ఈ సినిమా ఇంకాస్త అంచనాలు పెరిగాయి. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు.. ఈ క్రమంలో ఈ టీమ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. సినిమాను కొన్న బయ్యర్లకు డబ్బులను వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసినట్లు ఓ వార్త వినిపిస్తుంది.. అయితే ఎందుకు నిర్మాత అలా చేశాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

బయ్యర్ల కు డబ్బులు ఇచ్చేస్తున్న కేవీఎన్..

హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడం కోసం సినిమాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.. అయితే ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయానికి వచ్చిన తర్వాతే సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారు.. ఈ నేపథ్యంలో ఆయన చివరగా కమిట్ అయిన జన నాయగన్ మూవీని పూర్తి చేశారు. నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ కావాల్సింది. కానీ దాదాపు ఆరు నెలలుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.. ఈ చిత్రాన్ని భారీ ధరకు బయ్యర్లు కొనుగోలు చేశారు. అయితే సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో రిలీజ్ ఆలస్యం అవుతుండటంతో వ్యాపార పరంగా బయ్యర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాళ్లకు తీసుకున్న అడ్వాన్స్ డబ్బులను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కేవీఎన్ ప్రొడక్షన్ భావిస్తుందట.. ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్ మీడియా వర్గాల్లో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. సినిమా ఇప్పటిలో రిలీజ్ అవ్వదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిర్మాత దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి..

Advertisement

Also Read :పాలిటిక్స్ లోకి కోలీవుడ్ హీరో ఎంట్రీ.. ఉపఎన్నికల్లో పోటీ..

‘జన నాయగన్ ‘ మూవీ.. 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గత కొన్ని లుగా నటిస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. ఆయన సినిమాలకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం ఆయన నటించిన చివరి సినిమా జన నాయగన్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందింది. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలు చేయగా, బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామని విజయ్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు..

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×