E-Paper
Advertisement

Premium Theater: ఇనోర్బిట్ మాల్ లో మరో ప్రీమియం థియేటర్.. కళ్లు చెదిరిపోయేలా ఉంది గురూ!

Premium Theater: ఇనోర్బిట్ మాల్ లో మరో ప్రీమియం థియేటర్.. కళ్లు చెదిరిపోయేలా ఉంది గురూ!
Advertisement

Premium Theater Inorbit Mall: హైదరాబాద్‌ లోని సినిమా లవర్స్ కు మరో క్రేజీ న్యూస్. సిటీ నెమ్మదిగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచి లేటెస్ట్ సినిమా ఫార్మాట్‌ లోకి కంప్లీగ్ గా మారుతోంది. ఇప్పుడు కొత్త ప్రీమియం అప్‌గ్రేడ్స్ తో ఆకట్టుకుంటున్నాయి. EPIQ, PCX, డాల్బీ సినిమా, రాబోయే IMAX స్క్రీన్‌లతో పాటు PXL అనుభవాన్ని అందించబోతున్నాయి. హైదరాబాద్  దేశంలోని అత్యంత క్రేజీ సినిమా హబ్‌ లలో ఒకటిగా మారుతోంది.  అందులో భాగంగానే సైబరాబాద్ ఇనోర్బిట్ మాల్ లోని PVR INOX మరింత అప్ డేట్ అయ్యింది. ఇప్పటికే ఉన్న మల్టీ ప్లెక్స్‌ ను సూపర్‌ ప్లెక్స్‌ గా మార్చింది.

PVR INOXలో 11-స్క్రీన్ సూపర్‌ ప్లెక్స్‌ ఆవిష్కరణ

PVR INOX సైబరాబాద్‌ లోని ఇనోర్బిట్ మాల్‌ లో ఐదు కొత్త స్క్రీన్‌ లను యాడ్ చేసింది. ఇప్పుడు మొత్తం స్క్రీన్‌ ల సంఖ్య 11కి చేరుకుంది. అప్‌ గ్రేడ్ అయిన సూపర్‌ ప్లెక్స్ ఇప్పుడు ఒకే రూఫ్ కింద 1,368 సీట్లను అందిస్తుంది. ఇందులో 210 PXL సీట్లు, 107 లక్స్ సీట్లు, 104 4DX సీట్లు, 947 మెయిన్ స్ట్రీమ్ సీట్లు ఉన్నాయి. తాజా ఎక్స్ పాన్షన్ తో ఇనోర్బిట్ మాల్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఒకే చోట పెద్ద సంఖ్యలో సినిమా స్క్రీన్‌లను కలిగి ఉంది.

హైదరాబాద్ లోకి PXL ఎంట్రీ

Advertisement

PVR INOXలో థియేటర్ల విస్తరణలో అతిపెద్ద హైలైట్ PXL ప్రారంభం. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిది. PXL స్క్రీన్‌లో 55 అడుగుల వెడల్పు గల భారీ వాల్ టు వాల్ స్కోప్ స్క్రీన్, RGB లేజర్ ప్రొజెక్షన్, ఇన్ సీలింగ్ స్పీకర్లతో డాల్బీ అట్మోస్ సౌండ్, ప్లష్ రిక్లైనర్ సీటింగ్ ఉన్నాయి.

Advertisement

Read Also: భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!

‘ధురంధర్’ చిత్రంతో PXL బుకింగ్స్ ప్రారంభం

రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రంతో PXL బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సినీ లవర్స్ ఇప్పటికే థియేటర్‌కు తరలి వస్తున్నారు. ‘ధురంధర్’ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా. డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ చిత్రంలో రణ్‌ వీర్ సింగ్ పవర్‌ ఫుల్ అండర్‌ కవర్ స్పై రోల్ లో కనిపించారు. అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ఇతర పాత్రల్లో కనిపించారు. ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ ఈ సినిమాను తెరకెక్కించారు. IC-814 హైజాక్, పార్లమెంట్ అటాక్ లాంటి నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. స్పై మిషన్, పాకిస్తాన్ అండర్‌ వరల్డ్ నేపథ్యంలో ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్, ప్యాట్రియాటిజం ఫుల్ గా కొనసాగింది.  రిలీజ్ అయి 11 రోజుల్లోనే ఇండియాలో రూ. 379 కోట్ల నెట్, వరల్డ్‌ వైడ్ రూ. 540 కోట్లు సాధించింది. ‘ధురంధర్ పార్ట్ 2’ మార్చి 19, 2026న రిలీజ్ కానుంది.

Read Also:  అక్కడ నీళ్లు పైకి ప్రవహిస్తాయి.. చూస్తే మెంటలెక్కడం పక్కా!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×