E-Paper
Advertisement

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?
Advertisement

Hyderabad to Shirdi Tour Package:  షిర్డీ సాయిబాబా దర్శనంతో పాటు మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటున్నారా? అయితే, ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఆరు రోజుల టూర్ ప్యాకేజీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్యాకేజీలో అజంతా, ఎల్లోరా గుహలతో పాటు పలు ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4, 2026 వరకు కొనసాగుతుంది. ఒక్కొక్కరికి రూ.34,800 నుంచి ప్యాకేజీ ధర ప్రారంభమవుతుంది.

ఆరు రోజుల్లో ఎక్కడెక్కడికి వెళ్లొచ్చు?

ఈ టూర్ హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో ప్రారంభమవుతుంది. మొదటి రోజు శంభాజీనగర్ చేరుకున్న తర్వాత బీబీ కా మక్బరా, ఎల్లోరా గుహలు, గ్రిష్ణేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. చారిత్రక కట్టడాలు, పురాతన శిల్పకళను ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రెండో రోజు అజంతా గుహల సందర్శన ఉంటుంది. ఇక్కడి పురాతన గుహలు, చిత్రాలు, శిల్పాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. మూడో రోజు శని శింగణాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత షిర్డీకి చేరుకుంటారు. అక్కడ సాయిబాబా దర్శనం చేసుకోవచ్చు. నాలుగో రోజు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తారు. ఐదో రోజు సప్తశృంగి మాత ఆలయానికి వెళ్తారు. చివరి రోజు నాసిక్‌లోని పంచవటి ప్రాంతాన్ని చూసిన తర్వాత షిర్డీ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

ప్యాకేజీ ధరలు ఎంతంటే?

Advertisement

ఈ టూర్ ప్యాకేజీ ధర గదిలో ఎంతమంది ఉంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకరు ప్రత్యేక గదిలో ఉంటే రూ.45,300.. ఇద్దరు ఒకే గదిలో ఉంటే ఒక్కొక్కరికి రూ.35,500.. ముగ్గురు ఒక గదిలో ఉంటే ఒక్కొక్కరికి రూ.34,800.. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు అదనపు బెడ్‌తో రూ.31,250 వరకు ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ప్రయాణించే వారికి ఈ టూర్ బాగుంటుంది.

ప్యాకేజీలో ఏ సదుపాయాలు ఉంటాయి?

హైదరాబాద్ నుంచి శంభాజీనగర్‌కు, షిర్డీ నుంచి హైదరాబాద్‌కు విమాన టికెట్లు ఈ ప్యాకేజీలో ఉంటాయి. ఐదు రాత్రుల పాటు హోటల్ వసతి, బ్రేక్‌ ఫాస్ట్, డిన్నర్, స్థానిక ప్రాంతాల సందర్శనకు ఏసీ బస్సు సదుపాయం కల్పిస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

Advertisement

మధ్యాహ్న భోజనం, విమానంలో ఫుడ్, ఆలయ దర్శన టికెట్లు, పర్యాటక ప్రాంతాల ఎంట్రీ ఫీజులు, గైడ్ ఛార్జీలు, వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. వీటికి ప్రయాణికులు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. టూర్ టికెట్ బుక్ చేసుకునే ముందు సీట్ల అవైలబులిటీ, తాజా ధరలు, నిబంధనలను ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం మంచిది.

Read Also: జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

Tags

Related News

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

Big Stories

Advertisement
×