E-Paper
Advertisement

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు
Advertisement

Bhogapuram Airport: ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరొక విమాన సర్వీసు అక్టోబర్ చివరివారం నుంచి అందుబాటులోకి రానుంది. భోగాపురం నుంచి బ్యాంకాక్ మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ఈ సర్వీసు ప్రారంభించనుంది.

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు

విశాఖపట్నంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడి నుంచి రెండు సర్వీసులు ఉన్నాయి. భోగాపురం నుంచి సింగపూర్ కాగా, మరొకటి అబుదాబికు మాత్రమే నడుస్తున్నాయి. ఈ క్రమంలో మరొక సర్వీసు అందుబాటులోకి రానుంది. భోగాపురం నుంచి బ్యాంకాక్‌ల మధ్య కొత్త సర్వీసు రానుంది. అక్టోబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది.ఈ సర్వీసును ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ నడపనుంది.

Advertisement

వారానికి రెండు విమానాలను నడపనున్నట్లు సమాచారం. విశాఖ నుంచి బ్యాంకాక్‌కు మంగళ, శుక్రవారాల్లో సర్వీసు ఉండనుంది. భోగాపురంలో ఉదయం 11.30 బయలు దేరి సాయంత్రం 4 గంటలకు అక్కడకు వెళ్లనుంది. బ్యాంకాక్ నుంచి భోగాపురంకు బుధ, శనివారాల్లో నడపాలని ఆలోచన చేస్తోంది. బ్యాంకాక్‌లో అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరి భోగాపురం వచ్చేసరికి తెల్లవారుజామున నాలుగు గంటలకు విమానం రానుంది.

భోగాపురం నుంచి బ్యాంకాక్‌కు విమాన సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి

భోగాపురం ఎయిర్‌పోర్టు ఈ ఏడాది చివరి నాటికి దాదాపు డజను దేశాలకు అంతర్జాతీయ సర్వీసులు నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రయాణికుల సంఖ్యను నిర్ధారించుకున్న తర్వాత దేశీయ విమాన కంపెనీలు సర్వీసులు మొదలుపెడుతున్నాయి. తొలుత ఇండియా నుంచి సర్వీసులు ప్రారంభిస్తే.. విదేశాల నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీనివల్ల స్థానిక టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.

Advertisement

ALSO READ: శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

భోగాపురం నుంచి దేశీయ విమానాల కనెక్టివిటీ విషయానికి వద్దాం. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాలు వచ్చేందుకు తెర వెనుక పనులు జరుగుతున్నాయి. భోగాపురం నుంచి మెట్రో నగరాలతోపాటు ద్వితీయ‌ శ్రేణి విమానాలు నడిపేందుకు పలు సంస్థలతో మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. అదే జరిగితే వచ్చే ఏడాది నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల తాకిడి పెరగడం ఖాయమని అంటున్నారు స్థానిక ట్రావెలర్స్.

Related News

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!

ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!

ఉప్పునీటి సరస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లిన వందే భారత్.. చూస్తే కళ్ళు చెదిరి పోవాల్సిందే!

అడవిలో పారేసిన 12 టన్నుల నారింజ వ్యర్థాలు.. 15 ఏళ్ల తర్వాత జరిగింది చూసి.. యావత్ ప్రపంచమే షాక్!

చిన్న తెగ నుంచి IAS వరకు.. దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!

Big Stories

Advertisement
×