E-Paper
Advertisement

టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, అలాంటివారి నో ఛాన్స్

టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, అలాంటివారి నో ఛాన్స్
Advertisement

Supreme Court: దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత ప్రమాణాలు లేకుండా ఉపాధ్యాయులను నియమించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అసలు కేసు ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

దేశవ్యాప్తంగా పాఠశాలలు-కళాశాల్లో టీచర్ పోస్టుల నియామకాలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. విద్యావ్యవస్థలో నాణ్యతను కాపాడేందుకు అర్హత లేని వ్యక్తులను టీచర్లుగా నియమించకూడదని తేల్చిచెప్పింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం.. నిర్దేశించిన అర్హతలు వారికి తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అర్హత లేని టీచర్లతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని తేల్చి చెప్పింది. టెట్ లాంటి అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించొద్దని ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్ స్పష్టంచేసింది.

అర్హత లేనివారికి నో ఛాన్స్

Advertisement

అర్హత లేని టీచర్ల నియామకంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మద్యంతర ఆదేశాలు ఇచ్చింది. అస్సాం టీచర్ల వ్యవహారంలో ఈ తీర్పు ఇచ్చింది. టీచర్ల రిక్రూట్మెంట్‌పై సమీక్ష చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ విద్యాసంస్థలలో ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులను కొన్ని సందర్భాల్లో అవసరమైన అర్హతలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు అస్సాం ప్రభుత్వం ఇవ్వడంపై ఓ పిటిషన్ న్యాయస్థానం తలుపు తట్టారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేనివారిని కొత్తగా నియమించడం, ఇప్పటికే సర్వీసులో ఉన్నవారిని కొనసాగించడానికి వీల్లేదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. ఎలాంటి పారదర్శక నియామక ప్రక్రియ లేకుండా అర్హతలు లేని వ్యక్తులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది.  విచారణ సందర్భంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. అర్హత లేనివారిని ఉపాధ్యాయులుగా ఎందుకు నియమిస్తున్నారు?

Advertisement

ALSO READ: శ్రీవారి దర్శనం తర్వాత బెంగళూరు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

దీనివల్ల భావి తరాల భవిష్యత్తును నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. రాజ్యాంగం కల్పించిన అధికరణం 21-A ప్రకారం.. నాణ్యమైన విద్య ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కని గుర్తుచేసింది. నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఇష్టానుసారం నియామకాలు చేపడితే విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని అభిప్రాయపడింది. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ నియామకాలు పారదర్శకంగా, నిబంధనలకు లోబడి జరగాలని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు.

Related News

పరీక్షల్లో 95.7 శాతం మార్కులు.. అయినా స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాళ్ల ఉద్యోగాలు ఔట్!

శ్రీవారి దర్శనం తర్వాత బెంగళూరు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్.. డబుల్ మీనింగ్స్ వద్దు, చట్టం ఊరుకోదని హెచ్చరించిన సీఎం విజయ్

ఢిల్లీ పీజీ హాస్టల్ భవనం ఘటన.. పెరుగుతున్న మృతులు, సీసీటీవీలో కీలక విషయాలు, శిథిలాల కింద ఇంకా

చెంప దెబ్బ కొట్టినందుకు.. యువతి గొంతులో కత్తులు దింపాడు యువకుడు, గురుగ్రామ్‌లో ఘటన

ఢిల్లీలో భారీ వర్షాలు.. కూలిన మూడంతస్తుల భవనం

Big Stories

Advertisement
×