E-Paper
Advertisement

బహుమతుల బాక్సుల్లో నరికేసిన మనుషుల చేతులు… కళ్లు తిప్పుకోనివ్వని సైకో కిల్లర్ వేట

బహుమతుల బాక్సుల్లో నరికేసిన మనుషుల చేతులు… కళ్లు తిప్పుకోనివ్వని సైకో కిల్లర్ వేట
Advertisement

Psychological Crime Thriller on OTT : ఇంటికి ఓ గిఫ్ట్ బాక్స్ వస్తుంది… దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఉండేది బహుమతి కాదు, నరికేసిన మనిషి చేయి. అసలు ఈ చేతులు ఎవరివి? గిఫ్ట్ బాక్సులు పంపిస్తున్నది ఎవరు ? పోలీసులు ఎంత వెతికినా కిల్లర్ ఎందుకు దొరకడు ? ఇలాంటి భయంకరమైన ప్రశ్నలతో మొదలయ్యే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘Yuddham Sei’. మరి ఈ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ ఓ షాకింగ్ సంఘటనతో మొదలవుతుంది. కొన్ని ఇళ్లకు అనుమానాస్పదంగా గిఫ్ట్ బాక్సులు చేరుతాయి. వాటిని తెరిచిన తర్వాత బయటపడే దృశ్యాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తాయి. బాక్సుల్లో మనుషుల చేతులు ఉండటంతో పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెడతారు. కానీ ఇది సాధారణ హత్యల కేసు కాదని ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ అర్థమవుతుంది.

Advertisement

కేసును ఛేదించే బాధ్యత తీసుకున్న ఇన్వెస్టిగేటర్‌కు వరుసగా కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఒక హత్యకు సంబంధించిన క్లూ మరో వ్యక్తి దగ్గరకు తీసుకెళ్తే, అక్కడ మరో షాకింగ్ నిజం బయట పడుతుంది. హత్యలకు గురైన వ్యక్తుల మధ్య ఏదో సంబంధం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. కిల్లర్ మాత్రం పోలీసుల కంటే ఒక అడుగు ముందే ఉండి తన ఆటను కొనసాగిస్తుంటాడు.

ఇంత క్రూరంగా మనుషులను ఎందుకు చంపుతున్నారు ? గిఫ్ట్ బాక్సుల రూపంలో శరీర భాగాలను పంపడం వెనుక కిల్లర్ ఉద్దేశం ఏంటి ? బాధితులందరి మధ్య ఉన్న కామన్ లింక్ ఏంటి ? చివరికి పోలీసులు ఈ సైకో కిల్లర్‌ను పట్టుకోగలిగారా ? అసలు ఈ హత్యల వెనుక దాగి ఉన్న నిజం బయటపడినప్పుడు పరిస్థితి ఎలా మారుతుంది ? అనేదే సినిమాలో చూడాల్సిన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.

Advertisement

ఒకదాని తర్వాత ఒకటి బయటపడే మర్డర్లు, వాటి వెనుక దాగి ఉన్న మిస్టరీ, కిల్లర్‌ను పట్టుకునేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కథను క్షణక్షణం ఉత్కంఠగా మారుస్తుంది. ముఖ్యంగా ప్రతి హత్య వెనుక ఓ బలమైన కారణం ఉందేమో అన్న అనుమానం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఆధారాలు దొరికినట్టే దొరికి మళ్లీ మిస్టరీగా మారిపోవడం, అనుమానితులు ఒక్కొక్కరుగా తెరపైకి రావడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. మరి ఈ చేతుల వెనుక ఉన్న సైకో కిల్లర్ ఎవరు ? అతని టార్గెట్ ఎవరు ? ఈ హత్యలన్నింటికీ అసలు సంబంధం ఏంటి ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : నగరం నడిబొడ్డున రగిలిన ప్రజా విప్లవం… టాక్సీ డ్రైవర్ సాహసానికి గూస్‌బంప్స్ గ్యారెంటీ… వరల్డ్ క్లాస్ కల్ట్ హిట్

తెలుగులో అందుబాటులో ఉందా?

‘యుద్ధం సేయి’ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, సైకలాజికల్ థ్రిల్ కలగలిసిన ఈ సినిమా 7.9 రేటింగ్ తో JioHotstar, ZEE5లో అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్‌లో చివరి వరకు అసలు కిల్లర్ ఎవరో అర్థం కాకుండా కథ నడిచే సినిమాలు ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిస్. ప్రతి క్లూతో మిస్టరీ మరింత పెరుగుతూ, చివర్లో అసలు నిజాన్ని రివీల్ చేసే స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది.

Tags

Related News

కిడ్నాప్ తర్వాత గతం మర్చిపోయే అమ్మాయి… షాకింగ్ ట్విస్టులతో అదిరిపోయే రొమాంటిక్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

ఓటీటీలోకి సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వైరల్!

నగరం నడిబొడ్డున రగిలిన ప్రజా విప్లవం… టాక్సీ డ్రైవర్ సాహసానికి గూస్‌బంప్స్ గ్యారెంటీ… వరల్డ్ క్లాస్ కల్ట్ హిట్

అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా జరిగిన దారుణం… నరనరాల్లో భయం పుట్టించే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

పాత జ్ఞాపకాల మధురమైన కాన్వాస్… సతీష్ వేగేశ్న మార్క్ ఫ్యామిలీ ఈవెంట్ విజువల్ ట్రీట్

కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ సామాన్యుడి పోరాటం… మనసును తాకే ఎమోషనల్ మాస్టర్‌పీస్

అంతరిక్షం నుంచి వచ్చిన వింత సంకేతం… మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేసే సైన్స్ ఫిక్షన్ వండర్

Big Stories

Advertisement
×