మనదేశంలో అత్యంత కాలుష్యం నిండిన నగరంగా ఢిల్లీకే పేరు ఉంది. ఇప్పుడు ఢిల్లీని మించిపోయి మరొక నగరం విపరీతమైన కాలుష్యం బారిన పడింది. అదే అస్సాం మేఘాలయ సరిహద్దులో ఉన్న బర్నెహాట్.
సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ క్లీన్ హెయిర్ రీసెర్చ్ 2025 సంవత్సరంనకు సంబంధించి దేశంలో గాలి నాణ్యత పై విశ్లేషణ చేసింది. ఆ నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం కాలుష్యపరంగా దేశంలో మొదటి స్థానంలో ఉన్నది బర్నిహాట్ నగరం. ఇక రెండో స్థానంలో ఉన్నది ఢిల్లీ.
మనదేశంలోని దాదాపు 293 నగరాలపై పరిశోధన జరిగింది. వీటిల్లో 122 నగరాలు మొదటి ఆరు నెలల్లోనే కలుషితంగా మారాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 239 నగరాలు వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల జాబితాలో చేరిపోయాయి.
మొదటి స్థానంలో బర్నెహాట్
ఢిల్లీలో వాయు కాలుష్యం అధికంగానే ఉంది. మరొక ఆరు నెలల్లో కాలుష్యం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కలుషిత నగరాల్లో బర్నిహాట్ మొదటి స్థానంలో ఉండగా… తరువాత వరుస స్థానాల్లో ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్, హాజీపూర్ వంటి నగరాలు నిలిచాయి.
ఈ కొత్త నివేదిక ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఆ నగరంలో గడువు ముగిసిన వాహనాలను నిషేధించడం ముఖ్యమైనది. ఎందుకంటే పాత వాహనాలు నుంచే అధికంగా కలుషిత వాయువులు విడుదలవుతాయి. ఇవి ఏడాది పొడవునా నగరంలో కాలుష్యాన్ని పెంచుతూనే ఉంటాయి. అందుకే వాయు కాలుష్యానికి కారణం అవుతున్న వాహనాలను తొలగించడం ముఖ్య పద్ధతిగా ప్రభుత్వాలు గుర్తించాయి. వాయు కాలుష్యానికి పాత వాహనాలు 17 నుంచి 18 శాతం నుంచి కారణమవుతున్నాయని నివేదిక చెబుతోంది. అలాగే కర్మాగారాల నుంచి వచ్చే పొగలు, పంటలను కాల్చడం వంటివి కూడా వాయు కాలుష్యానికి కారణమేనని నివేదిక వివరిస్తుంది.