దేశ వ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో రైల్వే స్టేషన్లకు రద్దీ పెరుగుతోంది. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇండియన్ రైల్వే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. డిమాండ్ కు అనుగుణంగా కీలక మార్గాల్లో 150 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 మధ్య ఈ రైళ్లు 2,000 కి పైగా ట్రిప్పులను వేయనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు దుర్గా పూజ, దీపావళి, ఛత్ పూజ సమయంలో ప్రయాణీకుల రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఈ రైళ్లు సర్వీసులు అందించనున్నాయి. ఢిల్లీ నుంచి పాట్నా, ముంబై నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి గయా వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు ఇంటికి వెళ్లే వారికి, విహారయాత్రలను ప్లాన్ చేసుకునే వారికి ఉపయోగకరంగా ఉంటాయి.
⦿ South Central Railway (SCR): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 48 ప్రత్యేక రైళ్లు కేటాయించారు. ఈ రైళ్లు మొత్తం 684 ట్రిప్పులు వేయనున్నాయి. ఈ రైళ్ల హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు కొనసాగించనున్నాయి.
⦿East Central Railway (ECR): ఈ రైల్వే పరిధిలో 14 రైళ్లు 588 ట్రిప్పులు వేయనున్నాయి. పాట్నా, గయ, దర్భంగా, ముజఫర్ పూర్ మధ్య రాకపోకలు కొనసాగిస్తాయి.
⦿ Western Railway: మొత్తం 24 రైళ్లు, 204 ట్రిప్పులు వేయనున్నాయి. ముంబై, సూరత్, వడోదర మధ్య రాకపోకలు కొనసాగించనున్నాయి.
⦿ Southern Railway: మొత్తం 10 రైళ్లు, 66 ట్రిప్పులను అందించనున్నాయి. చెన్నై, కోయంబత్తూర్, మధురై మార్గాల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి.
⦿ Eastern Railway: 24 రైళ్లు, 198 ట్రిప్పులు వేయనున్నాయి. కోల్‌కతా, సీల్దా, హౌరా నుంచి రైల్వే సేవలు కొనసాగనున్నాయి.
అటు తూర్పు తీర రైల్వే పరిధిలోని భువనేశ్వర్, పూరి, సంబల్ పూర్, సదరన్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని రాంచీ, టాటానగర్, ఉత్తర రైల్వే పరిధిలో ప్రయాగ్ రాజ్, కన్పూర్ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అటు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని బిలాస్ పూర్, రాయ్ పూర్ మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి. పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని భోపాల్, కోటా నుంచి రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి.
Read Also: ఈ దేశానికి వెళ్తే మీరు విమానాల్లో ఫ్రీగా తిరగొచ్చు.. చిల్లిగవ్వ కూడా చెల్లించక్కర్లేదు!
భారత రైల్వే కీలక రాష్ట్రాలలో డిమాండ్ ఆధారంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు 2,024 ట్రిప్పులు కన్ఫార్మ్ చేసినప్పటికీ, పండుగ సీజన్ పెరుగుతున్న కొద్దీ మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. పండుగ కోసం సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను సమీపంలోని రైల్వేస్టేషన్లు లేదంటే ఇండియన్ రైల్వే అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలన్నారు.
Read Also: అందుబాటులోకి 20 కోచ్ ల వందేభారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు!