భారతీయ రైల్వేలోకి అడుగు పెట్టిన అత్యాధునిక వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దేశ వ్యాప్తంగా ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అధిక వేగం, అత్యాధునిక సౌకర్యాలతో ఆహ్లాదకర ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 150కి పైగా వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రైళ్లలో అత్యధికంగా 16 కోచ్ లు ఉన్నాయి. అయితే, పలు మార్గాల్లో ప్రయాణీకుల నుంచి ఎక్కువ డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కోచ్ ల సంఖ్య పెంచాలని భారతీయ రైల్వే నిర్వహించింది. ఇందులో భాగంగానే మొత్తం 13 జతల రైళ్లను 20 కోచ్ లకు పెంచనున్నారు. ఇప్పటి వరకు 8, 16 కోచ్ లతో వందేభారత్ రైళ్లు నడుస్తుండగా, ఇప్పుడు 20 కోచ్ కాన్ఫిగరేషన్ తో ప్రవేశపెట్టనుంది.
20 కోచ్ రైళ్లలో వారణాసి–న్యూ ఢిల్లీ–వారణాసి వందే భారత్, న్యూఢిల్లీ–కత్రా–న్యూ ఢిల్లీ సహా మొత్తం 13 రైళ్లు ఉన్నాయి. వీటిలో ఓ రైలు తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు తీయబోతోంది. ఇంతకీ 20 కోచ్ లతో నడిచే రైళ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ 22435/22436 – వారణాసి – న్యూఢిల్లీ – వారణాసి వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఈ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, న్యూఢిల్లీలో ఆగుతుంది.
⦿ 22439/22440- న్యూఢిల్లీ – కత్రా – న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఈ రైలు న్యూఢిల్లీ, అంబాలా, లూథియానా, జమ్ము తావి, కత్రాలో ఆగుతుంది.
⦿ 20901/20902- ముంబై సెంట్రల్ – గాంధీనగర్ రాజధాని – ముంబై సెంట్రల్ వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఇది ముంబై సెంట్రల్, బోరివలి, వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్, గాంధీనగర్ లో ఆగుతుంది.
⦿ 20833/20834- విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఈ రైలు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ లో ఆగుతుంది.
⦿ 20977/20978- అజ్మీర్ – చండీగఢ్ – అజ్మీర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్. అజ్మీర్, జైపూర్, అల్వార్, గుర్గావ్, ఢిల్లీలో ఆగుతుంది.
⦿ 20633/20634- తిరువనంతపురం – కాసరగోడ్ – తిరువనంతపురం వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఇది కాసర్ గోడ్, కన్నూర్, కోజికోడ్, షోర్నూర్, త్రిస్సూర్, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, కొల్లాం, తిరువనంతపురంలో ఆగుతుంది.
⦿ 22895/22896- హౌరా – పూరి – హౌరా వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఇది హౌరా, ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్ కేంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, పూరిలో ఆగుతుంది.
⦿ 22347/22348- హౌరా – పాట్నా – హౌరా వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఇది హౌరా, దుర్గాపూర్, అసన్సోల్, జమ్తారా, జసిదిహ్, లఖిసరాయ్, మొకామా, పాట్నా సాహిబ్, పాట్నాలో ఆగుతుంది.
⦿ 22415/22416- వారణాసి – న్యూఢిల్లీ – వారణాసి వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఈ రైలు బనారస్, ప్రయాగ్ రాజ్, కాన్పూర్, న్యూఢిల్లీలో ఆగుతుంది.
⦿ 22477/22478 – న్యూఢిల్లీ – కత్రా – న్యూఢిల్లీ వందేభారత ఎక్స్ ప్రెస్. ఇది న్యూఢిల్లీ, అంబాలా, లూథియానా, జమ్ము తావి, కత్రాలో ఆగుతుంది.
⦿ 22425/22426- అయోధ్య – ఆనంద్ విహార్ టెర్మినల్ – అయోధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఇది అయోధ్య, లక్నో, కాన్పూర్, ఆనంద్ విహార్ లో ఆగుతుంది.
⦿ 20707/20708- సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ . ఇది సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, సామర్లకోట, విశాఖపట్నంలో ఆగుతుంది.
⦿ 20627/20628- చెన్నై ఎగ్మోర్ – నాగర్‌కోయిల్ – చెన్నై ఎగ్మోర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఇది చెన్నై ఎగ్మోర్, తాంబరం, విల్లుపురం, తిరుచ్చి, మదురై, నాగర్‌కోయిల్ స్టేషన్లలో ఆగుతుంది.
Read Also: ఇక వాళ్లు పాస్ పోర్ట్, వీసా లేకుండానే రావచ్చు.. భారత్ కీలక నిర్ణయం!