BigTV English

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Dubai Police:

తమిళనాడుకు చెందిన యూట్యూబర్ మదన్ గౌరీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పలు దేశాల్లో పర్యటిస్తూ అక్కడి వింతలు విశేషాలు నెటిజన్లతో పంచుకుంటాడు. ఆయన యూట్యూబ్ చానెల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తను పెట్టే వీడియోలను చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు. ఇక రీసెంట్ గా గౌరీ దుబాయ్ కి వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో తన ఫోన్ పోగొట్టుకున్నాడు. తన ఫోన్ ను వెతికి పెట్టాల్సిందిగా అతడు దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక తాజాగా ఆయన ఫోన్ ను సేఫ్ గా చెన్నైకి పంపిచారు దుబాయ్ పోలీసులు. అదీ పూర్తిగా ఉచితంగా. ఈ విషయాన్ని గౌరీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.


పోగొట్టుకున్న ఫోన్ ఎలా తిరిగి వచ్చింది?

గౌరీ వారం క్రితం దుబాయ్ విమానాశ్రయంలో తన ఫోన్ పోగొట్టుకున్నట్లు వెల్లడించాడు. అక్కడి పోలీస్ సిబ్బంది నుంచి సహాయం కోరినప్పుడు, వారు ఫోన్ వివరాలను ఇమెయిల్ చేయమని మాత్రమే అడిగారు. చెన్నైకి తిరిగి వచ్చిన తర్వాత, తన ఫోన్ దొరికిందని నిర్ధారిస్తూ అతనికి ఇమెయిల్ వచ్చింది. ఆ తర్వాత దుబాయ్ పోలీసులు ఆ సెల్ ఫోన్ ను అక్కడి నుంచి విమానంలో ఉచితంగా చెన్నైకి తిరిగి పంపించే ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన దుబాయ్ పోలీసులకు కృతజ్ఞతలు చెప్తూ వీడియో షేర్ చేశాడు. అందులో పోలీసుల పనితీరును ప్రశంసించారు.


నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఈ ఘటనకు సంబంధిచిన వీడియోను సెప్టెంబర్ 2న గౌరీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2.6 మిలియన్ల వ్యూస్ అందుకుంది. 2 లక్షలకు పైగా లైక్‌ లను సంపాదించింది. నెటిజన్లు పోయిన ఫోన్‌ ను సజావుగా తిరిగి పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  అదే సమయంలో దుబాయ్ అధికారుల పని తీరును ప్రశంసించారు.“ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం దుబాయ్” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.“దుబాయ్‌ లో అత్యంత ఉత్తమమైన పోలీసులు ఉన్నారు. అక్కడ ఏదైనా పోగొట్టుకున్నా, సేఫ్ గా అందించడంలో ముందుంటారు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “దుబాయ్‌ ని చాలా మంది ఇష్టపడుతారు. ఎందుకు ఇష్టపడుతారు అనేది ఇప్పుడు అర్థం అయ్యింది” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీస్ వ్యవస్థ   

దుబాయ్ లో భద్రత విషయంలో కఠినమైన చట్టాలు అమల్లో ఉంటాయి. అంతేకాదు, పోలీసు వ్యవస్థ పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. దుబాయ్ లో పోయిన వస్తువులను అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఈజీగా కనిపెట్టేస్తారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల భద్రత పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి తమ దేశంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని భావిస్తారు. అందులో భాగంగానే గౌరీ ఫోన్ ను సురక్షితంగా ఇండియాకు పంపించారు.

Read Also: గుడిలో చోరీ.. ఆ తర్వాతి రోజే దొంగ ఇంట్లో ఊహించని ఘటన, దెబ్బకు డబ్బులు తిరిగిచ్చేశాడు!

Related News

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Vande Bharat Trains: అందుబాటులోకి 20 కోచ్‌ ల వందేభారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు!

Railway tunnels: సొరంగాల్లో సైరన్ ప్రతిధ్వని.. నంద్యాల రైల్వే టన్నెల్స్ రహస్యాలు ఇవే!

Women Assaulted: రైల్వే స్టేషన్‌ లో దారుణం, మహిళను తుపాకీతో బెదిరించి.. గదిలోకి లాక్కెళ్లి…

Railway Guidelines: ఆ టైమ్ లో రైల్లో రీల్స్ చూస్తున్నారా? ఇత్తడైపోద్ది జాగ్రత్త!

Big Stories

×