Metro news 2025: తమిళనాడు ప్రభుత్వం చెన్నై నగరానికి మెట్రో రైలు మౌలిక సదుపాయాలను విస్తరించడంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న చెన్నై మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూర్చే విధంగా, పూనమల్లీ నుండి సుంగువర్చాత్రం వరకు మెట్రో కారిడార్ విస్తరణకు పరిపాలనా ఆమోదం తెలిపింది. అసలుకు ఈ మార్గం లైట్ హౌస్ – పూనమల్లీ వరకు మాత్రమే ప్రణాళిక చేయబడింది. కానీ తాజా నిర్ణయంతో ఈ కారిడార్‌ను సుంగువర్చాత్రం వరకు పొడిగిస్తూ కొత్త మార్గరేఖను ఖరారు చేశారు.
ఈ విస్తరణ మొత్తం 27.9 కిలోమీటర్ల పొడవున సాగనుంది. ఈ రూట్‌లో 14 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని కోసం ప్రభుత్వం రూ. 2,126 కోట్లు కేటాయించింది. అందులో సుమారు రూ.1,836 కోట్లు భూమి సేకరణకే వినియోగించనున్నారు. పూనమల్లీ – సుంగువర్చాత్రం మార్గం అసలుకు 52.94 కి.మీ. పొడవైన పెద్ద కారిడార్‌లో భాగం. ఈ భారీ మార్గం చివరికి పూనమల్లీని ప్రతిపాదిత పరందూరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుతో కలిపేలా రూపొందించబడింది. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు సుమారు రూ.15,906 కోట్లుగా అంచనా వేశారు.
సెప్టెంబర్ 4న విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) వెంటనే ముందస్తు పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భూమి సేకరణ, రహదారి అభివృద్ధి, అవసరమైన అనుబంధ పనులు ఉంటాయి. వీటిని వేగంగా పూర్తి చేస్తే విస్తరణ సాఫీగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇది మాత్రమే కాదు, ప్రభుత్వం ఇటీవలే మరో కీలక ఆమోదం కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 3, 2025న చెన్నై విమానాశ్రయం నుండి కిళంబాక్కం వరకు మెట్రో విస్తరణ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 15.5 కి.మీ. పొడవున సాగనున్న ఈ మార్గం విమానాశ్రయాన్ని కలైఙ్గర్ శతాబ్ది బస్ టెర్మినస్‌తో కలుపుతుంది. దీని కోసం రూ.1,964 కోట్లు కేటాయించగా, భూమి సేకరణ, యుటిలిటీ మార్పిడి, అనుబంధ పనులకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.
Also Read: Karimnagar News: కరీంనగర్‌లో బుర్ఖా డ్రామా.. మెడికల్ కాలేజీలో కలకలం!
చెన్నై నగరానికి మెట్రో ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో గత ఒక దశాబ్దం అనుభవమే చెబుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న వాహన రద్దీని తగ్గించడంలో, ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందించడంలో మెట్రో రైలు కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు లక్షలాది మంది ప్రయాణికులు రోజూ మెట్రో సేవలను వినియోగిస్తుండటం దానికి నిదర్శనం. ఇప్పుడు కొత్తగా పూనమల్లీ – సుంగువర్చాత్రం మార్గం ఆమోదం పొందడంతో చెన్నై పశ్చిమ, దక్షిణ పశ్చిమ ప్రాంతాలకు మరింత కలకత్తా చేరబోతోంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం రవాణా సౌకర్యాన్ని మాత్రమే కాకుండా, ఆ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి, రియల్ ఎస్టేట్ విలువలు, వాణిజ్య ప్రాధాన్యత పెరగడానికి కూడా దోహదం చేస్తుంది. పరందూరు ఎయిర్‌పోర్ట్‌తో కలిసే మెట్రో మార్గం పూర్తి అయితే, చెన్నై నగర రవాణా చిత్రమే పూర్తిగా మారిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అభివృద్ధి నిర్ణయాలతో పాటు, మెట్రో రైలు రంగంలో పనిచేస్తున్న సంస్థలు, నాయకుల కృషిని గుర్తించేందుకు మెట్రో అవార్డులకు కూడా సెప్టెంబర్ 19న న్యూ ఢిల్లీలో నిర్వహించబడనుంది. 30 కేటగిరీల్లో అవార్డులు అందజేస్తూ, రైలు రవాణా పరిశ్రమలో విశేష కృషి చేసిన వారిని సత్కరించనున్నారు. మొత్తం మీద, తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ మెట్రో విస్తరణ నిర్ణయాలు చెన్నై నగర భవిష్యత్తుకు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఒకవైపు కొత్త విమానాశ్రయం కలిసే మెట్రో ప్రణాళికలు, మరోవైపు నగరంలో రద్దీ తగ్గించే చర్యలు.. ఇవన్నీ కలిపి చెన్నైని మరింత ఆధునిక, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దబోతున్నాయి.