E-Paper
Advertisement

Central Railway: రైలులో మ్యాగి వండిన మహిళ.. అడ్డంగా బుక్కైందిగా!

Central Railway: రైలులో మ్యాగి వండిన మహిళ.. అడ్డంగా బుక్కైందిగా!
Advertisement

Central Railway Action on Woman: సాధారణం ఫ్యామిలీతో కలిసి రైలు ప్రయాణం చేసే సమయంలో చాలా మంది ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్తారు. జర్నీ సమయంలో హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవడం సాధ్యం కాని వాళ్లు రైల్వే స్టేషన్లలో దొరికే ఫుడ్స్ కొనుగోలు చేస్తారు. మరికొంత మంది రైల్లో అమ్మే చిరుతిళ్లను తీసుకుంటారు. ముఖ్యంగా థెప్లా, మాత్రి, పరాఠా సబ్జీ, లిట్టి చిఖా, పూరి-సబ్జీ లాంటి ఫుడ్స్ తో పాటు స్టేషన్లలో లభించే చోలే భతురే, ఇడ్లీ, దోస, బిర్యానీ, టీ, కాఫీని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ బోగీ లోపల ఫుడ్ ప్రిపేర్ చేయడం సంచలనం కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆమె చేసిన పని పట్ల చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలకు కనీసం బుద్ది లేకుండా పోతుందని మండిపడుతున్నారు.

మహిళా ప్రయాణీకురాలిపై చర్యలు

రైల్లో వంట చేసిన మహిళపై సెంట్రల్ రైల్వే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. “రైళ్లలో ఎలక్ట్రానిక్ కెటిల్ ఉపయోగించడం నిషేధించబడింది. ఇది సురక్షితం కాదు. చట్టవిరుద్ధం. శిక్షార్హమైన నేరం. ఇది అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. ఇతర ప్రయాణీకుల భద్రకు పెను ముప్పు లాంటింది. ప్రయాణీకులు అలాంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదు. ఇలాంటి పనులు ఎవరు చేసినా, వెంటనే అధికారులు చెప్పాలి. సదరు మహిళపై చర్యల కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది” అని సెంట్రల్ రైల్వే వెల్లడించింది.

రైలులో మ్యాగీ చేసిన మహిళా ప్రయాణీకురాలు  

Advertisement

తాజాగా రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ​కెటిల్‌ లో మ్యాగీ ప్రిపేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఒక మహారాష్ట్ర మహిళ AC కంపార్ట్‌ మెంట్ స్విచ్‌ లోకి ప్లగ్ చేయబడిన కెటిల్‌లో ఇన్‌స్టంట్ నూడుల్స్ వండుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది.  ఆమె అలా ఫుడ్ తయారు చేయడాన్ని క్రేజీగా ఫీలవుతున్నట్లు వీడియోకు ఫోజులు ఇచ్చింది. అయితే, ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే, ఓవర్ లోడ్ కారణంగా సర్క్యూట్‌ జరిగే అవకాశం ఉంటుంది. మంటలు కూడా చెలరేగే అవకాశం ఉంటుంది. అందుకే, ఆమెపై చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే వెల్లడించింది.

Advertisement

నెటిజన్లు ఏమంటున్నారంటే?

అటు సదరు మహిళ వంట చేస్తున్న వీడియోపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. “ఇది నిజంగా అత్యంత ప్రమాదకరమైన పని. పెద్ద ప్రమాదాలకు కారణం అవుతుంది. అగ్నిప్రమాదం జరిగి వేలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇచ్చిన సౌకర్యాలను దుర్వినియోగం చేయడం నిజంగా దారుణం. ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. “రైళ్లలో DC పవర్ సరఫరా చేయబడుతుంది. ల్యాప్‌ టాప్‌ లను ఛార్జ్ చేయవచ్చు. కానీ, కెటిల్ ఉపయోగించడం చాలా డేంజర్” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

Read Also: ఈ దేశంలో యుద్ధం వచ్చినా, విపత్తు వచ్చినా.. ఒక్క పౌరుడు కూడా చావడు, గ్రేట్ సెల్యూట్!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×